BigTV English
Advertisement

Janhvi Kapoor : ఇది నా అదృష్టం, జాన్వి పాపా పెద్ది కన్సర్ట్ లో ఎంత ముద్దుగా మాట్లాడిందో

Janhvi Kapoor : ఇది నా అదృష్టం, జాన్వి పాపా పెద్ది కన్సర్ట్ లో ఎంత ముద్దుగా మాట్లాడిందో

Janhvi Kapoor : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న ప్రాజెక్టులలో పెద్ది ఒకటి. పెద్ద సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ షాట్ వీడియో విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా దానిలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసను మాట్లాడే విధానం చాలామందిని విపరీతంగా ఆకర్షించింది. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో చిట్టిబాబు అనే పాత్రలో కనిపించాడు చరణ్. ఆ పాత్రలో గోదావరి యాస మాట్లాడాడు. రామ్ చరణ్ టాలెంట్ అంతా కూడా బయట పెట్టిన సినిమా రంగస్థలం.


ఇప్పుడు సుకుమార్ శిష్యుడు చరణ్ లోని మరో అవతారాన్ని పెద్ది సినిమాతో బయటికి తీస్తున్నారు. ఈ సినిమా కోసం పెద్ద టెక్నీషియన్స్ ని కూడా హైర్ చేశారు. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ కొమరం పులి సినిమా తర్వాత తెలుగులో సంగీతం చేస్తున్న సినిమా పెద్ది. ఏఆర్ రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ని ఈ ప్రాజెక్టు కోసం ఒప్పించాడు అంటే ఇది ఎంత పవర్ఫుల్ సబ్జెక్టుతో అర్థం అవుతుంది. ఈ సినిమాలో జాన్వి కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇది నా అదృష్టం 

చాలామంది తెలుగు లాంగ్వేజ్ మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అందరికీ నమస్కారం అని కేవలం తెలుగులో చెప్పి మిగతాదంతా ఇంగ్లీషులో ఫినిష్ చేస్తారు. అయితే జాన్వి కపూర్ మాత్రం మాట్లాడింది కొద్దిసేపైనా కూడా తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేసింది.


ఏఆర్ రెహమాన్ మెగా కాన్సర్ట్ నేడు హైదరాబాదులో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో జాన్వి కపూర్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. “నేను ఈ రోజు నా IDOLS గా భావించే వారితో కలిసి ఈ వేదికపై ఉండటం చాలా ఆనందంగా ఉంది” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది జాన్వీకపూర్.

ఈ సినిమాలో అచ్చియమ్మ అనే పాత్రలో కనిపిస్తుంది జాన్వీ కపూర్. గతంలో కొన్ని సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో భాగంగా ఈ క్యారెక్టర్ గురించి చాలా గొప్పగా చెప్పింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన జాన్వి లుక్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.

బుచ్చి మాస్ ప్లానింగ్ 

శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పట్లో వచ్చిన తుఫానులు కూడా ఆ సినిమా ప్రభంజనాన్ని ఆపలేకపోయారు.

మళ్లీ చాలా ఏళ్ల తర్వాత ఒకవైపు శ్రీదేవి కూతురు మరొకవైపు మెగాస్టార్ చిరంజీవి కుమారుడితో ప్రాజెక్టు సెట్ చేశాడు బుచ్చిబాబు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ చాలామంది ప్రేక్షకులకు ఉంది. ఈ సినిమా మార్చ్ 25 2026 లో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

Also Read: Ram Charan: నా కల నిజం అయిపోయింది, కన్సర్ట్ లో రామ్ చరణ్ అదిరిపోయే ఎంట్రీ

Related News

Ram Charan: నా కల నిజం అయిపోయింది, కన్సర్ట్ లో రామ్ చరణ్ అదిరిపోయే ఎంట్రీ

SSMB29 : మొత్తానికి మహేష్ బాబు అప్డేట్ ఇచ్చాడు, గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ పై మహేష్ రియాక్షన్.

Gouri G Kishan : నాకు మారి సెల్వరాజ్ సార్ ఫోన్ చేశారు, ఇష్యూ గురించి ఏం చెప్పారంటే?

The Great Pre wedding show: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాపై బెల్లంకొండ రియాక్షన్, మొదటి సెలబ్రిటీ సపోర్ట్

Shraddha Das: అల్లు అర్జున్ టాలీవుడ్ షారుక్.. నా ప్రపంచమే మారిపోయిందన్న నటి!

Actor Vikranth: అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ..700 మంది ఎంప్లాయిస్.. ఈ హీరో బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదే!

Ajay Bhupathi : ఘట్టమనేని వారసుడు సినిమా టైటిల్ ఇదే, ఆ సెంటిమెంట్ వదలని అజయ్ భూపతి

Big Stories

×