Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 లో చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. వాళ్లతో పాటు కొంతమంది కామనర్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే వాళ్లలో ఆరుగురు బయటకు వెళ్లిపోయిన తర్వాత ఫైర్ స్ట్రోమ్ అంటూ మరో ఆరుగురిని హౌస్ లోపలికి పంపించారు. ఇక ఈ సీజన్ విషయానికి వస్తే ఊహించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. చదరంగం కాదు రణరంగం అని చెప్పారు కానీ అది కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయిపోతుంది అనే ఫీలింగ్ కలుగుతుంది.
ఇక హౌస్ లో పెద్దగా ఇష్టపడడానికి కూడా సరైన కంటెస్టెంట్ లేరు. కొంతమందికి మాత్రం ఇమ్మానుయేల్ ఫేవరెట్. మరి కొంతమందికి సుమన్ శెట్టి ఫేవరెట్. అయితే వాళ్లు కూడా ఏవో ఒక సందర్భాల్లో తప్పులు చేస్తూ దొరుకుతూనే ఉన్నారు. ఇమ్మానియేల్ ముఖ్యంగా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని ఈజీగా అర్థమయిపోతుంది.
కొంతమంది ఒక్కసారిగా పాపులర్ అవుతూ ఉంటారు. రాను నేను బొంబాయి కి రాను అనే పాటతో విపరీతంగా పాపులర్ అయిపోయాడు రాము. ఆ పాట దాదాపు 400 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించుకుంది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాము ఆట తీరు పెద్దగా ఎవరిని ఆకట్టుకోలేకపోయింది. కానీ కెప్టెన్ గా మాత్రం చాలా బాగా చేశాడు అని నాగర్జున నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. మరోవైపు రాముని తనుజ ట్రీట్ చేసే విధానం గురించి కూడా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి.
నాగార్జున కూడా తనుజను ఆ విషయం అడిగినప్పుడు చాలా క్లారిటీగా మధ్యలో వస్తాడు మళ్ళీ వీడి గురించి ఫస్ట్ నుంచి మేటర్ అంతా చెప్పాల్సి ఉంటుంది అని కవర్ చేసింది. అలానే తను సేఫ్ అయినప్పుడు దగ్గరికెళ్ళి రాముని హగ్ చేసుకుని యాక్టింగ్ చేసింది.
ఇక తాజాగా రాము హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. అయితే రాముని ఎవరు నామినేట్ చేయలే తనకు తానుగా ఎలిమినేట్ అయిపోయాడు.
హోమ్ సిక్ వలన రాము ఎలిమినేట్ అయిపోతుంటే తనుజ సర్ నేను వాడిని బాగా చూసుకున్నాను ఈ వారం అంతా నేనే ఉన్నాను అని మాట్లాడటం మొదలు పెట్టింది. కానీ ఒకప్పుడు ఇదే తనుజ వాడు పక్కన కూర్చుంటే దూరంగా వెళ్లిపోయేది. ఆ విషయం రాముని ఎన్నిసార్లు బాధపెట్టిందో చెప్పలేము. ఇప్పుడు తనుజ ఆ మాటలు చూస్తుంటే ఇంకా ఎంత నటిస్తావమ్మా అని అనకు తప్పదు.
Also Read: Bigg Boss 9: మరోసారి తన సెల్ఫిష్ బిహేవర్ బయట పెట్టిన ఇమ్మానియేల్