BigTV English
Advertisement

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలు వచ్చాయంటే ఇక ఫ్యాన్స్ ఓ లుక్ వేయకుండా ఉండలేరు. ఈ సినిమాలు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కూడా మామూలుగా ఉండదు. ఈ నేపథ్యంలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఒక థ్రిల్లర్ సినిమా మస్ట్ వాచ్ మూవీగా నిలుస్తోంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ ఈ సినిమాని వదిలిపెట్టకుండా వాచ్ చేస్తున్నారు. ఈ సినిమా ఒక టీనేజ్ గర్ల్‌ని సె*క్స్ ట్రాఫికింగ్ నుంచి రెస్క్యూ చేసే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఇందులో ప్రధాన పాత్రలో నటించిన ఫీనిక్స్ పెర్ఫార్మెన్స్ కు, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా లభించింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో

“You Were Never Really Here” 2017లో వచ్చిన ఒక థ్రిల్లర్ మూవీ. లిన్ రామ్సే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో జోవాక్విన్ ఫీనిక్స్ (జో), జూడిత్ రాబర్ట్స్, ఎకాటెరినా సామ్సనోవ్ (నినా), జాన్ డొమన్ మెయిన్ రోల్స్ లో నటించారు. 89 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 6.7/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

జో అనే వ్యక్తి లైఫ్‌లో చాలా బాధలు పడతాడు. చిన్నప్పుడు తండ్రి కూడా బాగా కొట్టేవాడు. పెద్దయ్యాక ఆర్మీలో యుద్ధాల్లో కూడా పాల్గొన్నాడు. ఆ తరువాత FBIలో పని చేస్తూ చిన్న పిల్లల డెడ్ బాడీస్ చూసి మైండ్ పాడైపోయింది. ఇప్పుడు అతను తన ముసలి తల్లితో కలసి ఒంటరిగా జీవిస్తుంటాడు. కానీ అతనికి ఎప్పుడూ సూసైడ్ ఆలోచనలు వస్తుంటాయి. ప్లాస్టిక్ కవర్ తల మీద పెట్టుకోవడం, రోప్‌తో ఉరేసుకోవడం లాంటివి కూడా చేస్తుంటాడు. ఈ సమయంలో అతను చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి, అఘాయిత్యం చేసే ఒక గ్యాంగ్‌ ని కొట్టి చంపుతుంటాడు. ఒకరోజు న్యూయార్క్ గవర్నర్ కూతురు 13 ఏళ్ల నీనా అదే గ్యాంగ్‌లో చిక్కుకుందని తెలుస్తుంది. ఇక జో ఆమెను రక్షించే పనిలో పడతాడు.


Read Also : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

ఆ గ్యాంగ్ అందరినీ సుత్తితో కొట్టి చంపేసి, నీనాని తీసుకొచ్చి ఇంట్లో దాచిపెడతాడు. నీనా చాలా షాక్‌లో ఉంటుంది, కానీ జోతో కొంచెం బాండ్ ఏర్పడుతుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ గ్యాంగ్‌ని న్యూయార్క్ గవర్నరే నడిపిస్తుంటాడు. ఇప్పుడు గవర్నర్ జో ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని టార్చర్ చేసి చంపి, నీనాని మళ్లీ తీసుకెళ్తారు. జో అమ్మ డెడ్ బాడీ చూసి పూర్తిగా బ్రేక్ అవుతాడు. రివెంజ్ కోసం గవర్నర్ ఇంట్లోకి వెళ్తాడు. క్లైమాక్స్ ఊహించని మలుపులు తీసుకుంటుంది. జో గవర్నర్ మీద రివేంజ్ తీర్చుకుంటాడా ? నీనాని అతని బారి నుంచి కాపాడతాడా అనే విషయాలను, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

Related News

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Big Stories

×