Illu Illalu Pillalu Today Episode November 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. లంచం తీసుకుంటు దొరికిపోయిందని తెలుసుకున్న శ్రీవల్లి ఆనందానికి అవదులు ఉండవు.. శ్రీవల్లి భాగ్యం బయటికి వచ్చి మరి నర్మదా అరెస్ట్ చేశారని డాన్సులు వేస్తూ ఉంటారు. చాలా సంతోషంగా ఉందమ్మా నర్మదా ఇన్ని రోజులు రెచ్చిపోయింది. ఇకమీదట నుంచి కుక్కిన పెనులాగా పడి ఉంటుంది అని శ్రీవల్లి అంటుంది. భద్రావతి సేన ఇద్దరు కూడా లంచం తీసుకుంటూ రిజిస్టర్ ఆఫీసర్ దొరికిపోయారు అని సంతోష పడుతూ ఉంటారు. మనతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. మన గురించి తెలిసి కూడా ఆ నర్మదా పులి లాగా రెచ్చిపోయింది.
ఇప్పుడు మాత్రం మన పేరు వింటే భయపడుతుందిలే అక్క అని సేన అంటాడు. ఏ ఆఫీసరేనా మనకు కనుసైగలతో పని చేసి పెట్టాలి అలాంటిది మన ముందే తోకజాడిస్తుందా అని భద్ర అంటుంది.. ఇప్పుడు ఆ నర్మద మొహం ఎలా ఉందో చూడాలి రా అని భద్రావతి అంటుంది.. భద్రావతి సేన ఇద్దరు కూడా నర్మదను దారుణంగా అవమానిస్తారు.. కానీ నర్మద మాత్రం ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. లంచం తీసుకుంటూ దొరికిపోయింది అని వచ్చిన వార్తల గురించి ఇంట్లోని వాళ్ళందరూ టెన్షన్ పడుతూ నర్మదను అడుగుతారు.. కానీ నర్మద మాత్రం ఎవరితోనూ ఏమి మాట్లాడకుండా తనలో తానే బాధపడుతూ మౌనంగా ఉండిపోతుంది.. ఎప్పుడూ అందరిమీదకి ఎగిరే నర్మదను శ్రీవల్లి మౌనంగా ఉన్నావేంటి నువ్వు లంచం తీసుకున్నావా? నీ మౌనం వెనుక అర్థం ఏంటి అని అడుగుతుంది. మామయ్య పరువు తీసేలా నువ్వు చేశావు ఆయన వస్తే తల ఎక్కడ పెట్టుకుంటారు.. మొన్న కలెక్టర్ వచ్చినప్పుడు నిన్ను గొప్పగా పొగిడారు ఆరోజు మామయ్యని అందరం ఎక్కించారు.. ఇవాళ మాత్రం ఆయన తల తీసేలా చేశావు అని శ్రీవల్లి మాట్లాడుతుంది.
శ్రీవల్లి ఎంతగా రెచ్చిపోయి మాట్లాడిన సరే నర్మద మాత్రం మౌనంగానే ఉండిపోతుంది. అయితే ఆయాస పడుతున్న శ్రీవల్లిని చూసి ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అనుకుంటాను ఇక నన్ను వదిలై నేను వెళ్లి పడుకుంటాను అని అంటుంది. తన జాబ్ పోయిందని తనని కావాలని ఇరికించారని నర్మదా బాధపడుతూ ఉంటుంది. నర్మదని చూసిన వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మా వాళ్ల గురించి నీకు చెప్పాను కదా వాళ్ళు రాక్షసులు. వాళ్లని ఎవరైనా ఎదిరిస్తే ఇలానే కక్ష తీర్చుకుంటారు అని మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు వినలేదు.
నీమీద నిందను మోసుకొని వచ్చావు.. నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు నా కోడలు ఎప్పుడూ తప్పు చేయదు.. ప్రేమ గురించి నా గురించి ఆలోచించి నువ్వు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు నీ తప్పు ఏమీ లేదని నువ్వు నిరూపించుకో అని వేదవతి చెప్పిన మాటలని, ప్రేమ చెప్పిన సలహాలని తీసుకున్న నర్మదా ఎలాగైనా సరే తన తప్పేమీ లేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది.. ధీరజ్ ప్రేమ వాళ్ళ కుటుంబ సభ్యులు నర్మదను కావాలని ఇరికించారని తెలుసుకుని కోపంగా ఉంటాడు.
ప్రేమ ఎంతగా ధీరజ్ మౌనంగా ఉండాలని చూసినా కూడా రెచ్చగొడుతుంది. నువ్వు ఏమైనా అంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను మల్ల తిరిగి రాను అని ప్రేమ దీరజ్ అంటుంది.. వీళ్ళిద్దరూ గొడవ పడటం భాగ్యం ఆనందరావు చూస్తారు. వీళ్ళ గొడవ ఎంతవరకు వెళుతుందో చూడాలని మౌనంగా ఉంటారు. ప్రేమ నన్ను అంటే నేను ఊరుకోను మా పుట్టింటికి వెళ్ళిపోతానని కోపంగా వెళ్ళిపోతుంది. ఇది నిజంగానే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుందేమో అని ధీరజ్ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తారు. కానీ ప్రేమ నిజంగానే వాళ్ళ పుట్టింటి లోపలికి వెళ్ళిపోతుంది.
Also Read :శర్వానంద్ జీవితాన్ని మార్చేసిన యాక్సిండెంట్.. 8 నెలలు నరకం..
ధీరజ్ వెనకాల వెళ్లి ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. భాగ్యం ఆనందరావు మాత్రం ఈ విషయాన్ని వెంటనే వేదవతికి చెప్పాలని అనుకుంటారు. లోపలికి వెళ్ళిన ప్రేమ మీరు చేసింది ఏమైనా బాగుందా ఒక మనిషిని ఎందుకు ఇలా ఇరికించారు. మీరు ఎప్పుడూ నన్ను మనిషిగా గుర్తించలేదు కానీ నాకు సొంత అక్క లాంటి నర్మద మీదే నిందలు వేస్తారా.. మీకు కొంచెం కూడా కనికరమనేటివి లేవా అని తన పుట్టింటి వాళ్ళని కడిగి పడేస్తుంది.. విశ్వం మాత్రం అమూల్య దగ్గర మంచివాడు అనిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు.. శ్రీవల్లి ఆ ఇంట్లో తనదే పెత్తనం నర్మద నోరు కూడా మూగది అయిపోయింది అని సంతోష్ పడుతూ ఉంటుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..