Pakistan: పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలోనే పాకిస్తాన్ జట్టు గెలుపు బాట… పట్టిన సంతోషంలో.. ఉన్న తరుణంలోనే… వరుసగా ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నాయి. తాజాగా ఆ జట్టు.. కోచ్ గ్యారీ క్రిస్టియన్ ( Gary Kirsten ) తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఈ తరుణంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఆయన రాజీనామాను ఆమోదించింది.
అదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ కోచ్ గా ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ ను నియామకం చేసింది. పాకిస్తాన్ పురుషుల క్రికెట్ టీం… అల్ ఫార్మాట్ హెడ్ కోచ్ గా… ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జేషన్ గిల్లేస్పి ( Jason Gillespie ) నియామకం కావడం జరిగింది. మొన్నటివరకు కేవలం టెస్టులకే ఆయన కోచ్గా కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గ్యారీ క్రిస్టన్ రాజీనామా చేయడంతో… పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ గా కూడా.. గిల్లేస్పి ని ఫైనల్ చేశారు.
ఇక ఆస్ట్రేలియా దేశంలో పాకిస్తాన్ త్వరలోనే పర్యటించబోతుంది. ఈ టోర్నమెంట్ నుంచి హెడ్ కోచ్ గా.. గిల్లేస్పి ( Jason Gillespie ) కొనసాగబోతున్నాడు. ఇతనిది ఆస్ట్రేలియా కాబట్టి… అక్కడి పరిస్థితులు పూర్తిగా తెలుస్తాయి. అయితే ఇది పాకిస్తాన్ జట్టుకు మేలు చేసే అవకాశాలు ఉంటాయి. అటు మహమ్మద్ రిజ్వాన్… పాకిస్తాన్ జట్టుకు కొత్త కెప్టెన్ అయిన సంగతి తెలిసిందే.