BigTV English
Advertisement

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న సినిమాలలో ఎక్కువగా, థ్రిల్లర్ కంటెంట్ ని చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తునారు ఆడియన్స్. కొన్ని సినిమాలైతే సీట్ ఎడ్జ్ వరకూ తీసుకెళ్ళి గూస్ బంప్స్ తెప్పిస్తుంటాయి. అలాంటి ఒక మూవీ ఈ రోజు మన మూవీ సజెషన్. ఈ సినిమా ఒక ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను వెంబడించే ఒక మిస్టీరియస్ వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఆమెను ఆ వ్యక్తి ఎందుకు వెంబడిస్తాడనేదే ఈ కథ. ఈ సినిమాని ఒంటరిగా చూస్తే మరింత థ్రిల్ ని ఎంజాయ్ చేయవచ్చు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘వాచర్’ (Watcher) 2022లో వచ్చిన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. క్లో ఒకునో దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో మైకా మన్రో (జూలియా), కార్ల్ గ్లూస్‌మన్ (ఫ్రాన్సిస్), బర్న్ గోర్మన్ (ది వాచర్) మెయిన్ రోల్స్ లో నటించారు. 96 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 6.3/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా Shudder, prime video లో అందుబాటుల ఉంది.

స్టోరీ ఏమిటంటే

జూలియా అనే అమెరికన్ అమ్మాయి, తన భర్త ఫ్రాన్సిస్‌ కి ప్రమోషన్ రావడంతో రొమేనియాకి వస్తుంది. జూలియాకి రొమేనియన్ భాష అర్థం కాదు. ఒంటరిగా ఇంట్లో ఉండి బోర్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే ఎదురుగా ఉన్న బిల్డింగ్ విండో నుంచి ఒక వ్యక్తి రోజూ ఆమెనే చూస్తూ ఉంటాడు. రాత్రి తను లైట్స్ ఆఫ్ చేస్తే అతడు కూడా ఆఫ్ చేస్తాడు. ఇలా ఆమె కళ్ళల్లో పడటానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడే సిటీలో ‘స్పైడర్’ అనే సీరియల్ కిల్లర్ యంగ్ అమ్మాయిల తలలు కోసి చంపేస్తున్నాడని న్యూస్‌లో వస్తుంది. జూలియా భయపడి భర్తకి చెప్తుంది కానీ అతడు బిజీలో అవన్నీ నీ ఊహలు అని లైట్ తీసుకుంటాడు.


Read Also : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

సూపర్ మార్కెట్, సినిమా థియేటర్‌లో కూడా అదే వ్యక్తి జూలియాను ఫాలో అవుతుంటాడు. ఆమె పోలీసులకి కంప్లైంట్ ఇస్తుంది కానీ భాష ప్రాబ్లమ్ వల్ల ఎవరూ సీరియస్ తీసుకోరు. నైబర్ ఇరినాతో ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది. ఆమెతో ఈ విషయాలను షేర్ చేసుకుంటుంది. ఆ తరువాత ఇరినా హెడ్‌లెస్ బాడీ దొరుకుతుంది. దీంతో ఆ వ్యక్తి నిజంగానే స్పైడర్ కిల్లర్ అని తెలుస్తుంది. ఇక ఆ వ్యక్తి ఏకంగా ఇంట్లోకి వచ్చి జూలియాపై అటాక్ చేస్తాడు. క్లైమాక్స్ మరింత ఉత్కంఠంగా నడుస్తుంది. చివారికి జూలియా, ఆ కిల్లర్ నుంచి తప్పించుకుంటుందా ? ఆ కిల్లర్ చేతిలో బలవుతుందా ? అనే విషయాలను, ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని చూసి తెలుసుకోండి.

 

Related News

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

×