Ashika Ranganath (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ ఆషిక రంగనాథ్ 1996 ఆగస్టు 5న కర్ణాటక తుముకూరులో జన్మించింది. ఈమెకు అక్క అనూష రంగనాథ్ కూడా ఉన్నారు. ఈమె కూడా కన్నడ సినిమాలలో నటించారు.
Ashika Ranganath (Source: Instragram)
ఇక ఆషాకా రంగనాథ్ విషయానికి వస్తే.. ప్రీ యూనివర్సిటీ కోసం బెంగళూరుకు వెళ్లి జ్యోతి నివాస్ కాలేజీలో చేరిన ఈమె.. అక్కడ క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు పోటీ ఆడిషన్లో పాల్గొని రన్నరప్ గా నిలిచింది.
Ashika Ranganath (Source: Instragram)
కన్నడ చిత్రం క్రేజీ బాయ్ అనే సినిమాతో తొలిసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. ఈ సినిమాతో ఉత్తమ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది.
Ashika Ranganath (Source: Instragram)
2023లో తెలుగులో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమీగోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత నాగార్జున నా సామిరంగా సినిమాలో కూడా కనిపించింది.
Ashika Ranganath (Source: Instragram)
ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె.. లేత గులాబీ రంగు చీర కట్టుకొని అందరి దృష్టిని ఆకర్షించింది.
Ashika Ranganath (Source: Instragram)
ఇక అందులో సెల్ఫీ దిగుతూ చీరకట్టులో అందాలు ఆరబోస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది.