The Raja Saab : ఈ రోజుల్లో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంటర్ ఇచ్చి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు దర్శకుడు మారుతి. బాక్సాఫీస్ వద్ద ఎన్నో విమర్శలకు గురి అయిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు కూడా వసూలు చేసింది. ఆ తర్వాత బస్టాప్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. కేవలం మొదట మూడు సినిమాలు మాత్రమే యూత్ ను ఆకట్టుకునే విధంగా తీసిన మారుతి ఆ తర్వాత తాను సినిమాలు చేసే శైలి కంప్లీట్ గా మార్చేశాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడగలిగే సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. బలే బలే మగాడివోయ్, శైలజ రెడ్డి అల్లుడు, బాబు బంగారం, ప్రతిరోజు పండగే వంటి ఫ్యామిలీ సినిమాలను చేసి మంచి సక్సెస్ అయ్యాడు. అయితే మారుతి కెరియర్ లో ఇప్పటివరకు ఒక డిజాస్టర్ సినిమా కూడా లేదు. ఒక మారుతి ప్రభాస్ తో రాజా సాబ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
రాజా సాబ్ టీజర్ అప్డేట్ ఇచ్చాడు
ప్రభాస్ తో సినిమా చేస్తే డార్లింగ్ , బుజ్జి గాడు వంటి ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తాను అని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు మారుతి. తను చెప్పినట్లుగానే ఒక హర్రర్ ఎంటర్టైన్మెంట్ సినిమాను చేస్తున్నాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ లో ఉన్న కామెడీ యాంగిల్ కంప్లీట్ గా దూరమైపోయింది. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో అది కనిపించనుంది. ఇప్పటివరకు దీని గురించి ఎక్కడ ప్రస్తావించని మారుతి మొదటిసారి రాజా సాబ్ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమా గురించి ఇప్పటివరకు నేను ఎక్కడా మాట్లాడలేదు. ఈ సినిమా గురించి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతకుమించి వన్ పర్సెంట్ ఎక్కువే ఉంటుంది. జూన్ 16న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసేసారు. రాజులకే రాజు ప్రభాస్ రాజు అంటూ మారుతి స్లోగన్ కూడా చెప్పాడు.
ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇక పండగే
బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్న విషయం తెలిసిందే. ఇది ప్రభాస్ అభిమానులు కూడా సంతోషకరమైన విషయమే. అయితే ప్రభాస్ కామెడీ టైమింగ్ చాలా రోజుల తర్వాత ఎలా ఉండబోతుందో అని క్యూరియాసిటీతో చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి డిసెంబర్ 5న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం కూడా తెలిసింది. ఇక 16వ తారీఖున వచ్చే టీజర్ చూసిన తర్వాత ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అందరికీ ఒక అవగాహన వస్తుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
Also Read : Thaman On Anirudh: అనిరుధ్ మ్యూజిక్ కు నేను ఇచ్చే ఆన్సర్ ఓజి