తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగాయి. రథసప్తమిని పురస్కరించుకొని శ్రీవారు సప్తవాహనాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వైభవంగా మొదలైన రథసప్తమి ఉత్సవాలలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, టీటీడీ అన్ని చర్యలు చేపట్టింది.
శ్రీవారు మొదటగా సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యోదయం అనంతరం సూర్య కిరణాలు తాకిన వెంటనే ప్రత్యేక హారతి, నివేదన అనంతరం 6:38 నిమిషాలకు తిరిగి వాహనసేవ ప్రారంభం ఉ 8 గంటలకు చిన్నశేష, ఉ 10 గంటలకు గరుడవాహనం పై శ్రీవారు దర్శనమిచ్చారు.
తేజో నిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యని వాహనంగా అధిరోహించి భక్తులను కటాక్షించారు శ్రీ మలయప్ప స్వామి వారు. సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు.
తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు తిరుమాడ వీధులు చేరుకుని గోవిందుడికి మంగళ హారతులు పలికారు.
తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు తిరుమాడ వీధులు చేరుకుని గోవిందుడికి మంగళ హారతులు పలికారు.
భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించడంలో టీటీడీ అధికారులు సఫలీకృతులయ్యారు. ఉదయం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతర అధికారులు శ్రీవారిని దర్శించుకున్నారు. రథసప్తమి ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులకు నిలువ నీడ కోసం ప్రత్యేక షెడ్ లను సైతం ఏర్పాటు చేశారు.
రథసప్తమి ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులకు నిలువ నీడ కోసం ప్రత్యేక షెడ్ లను సైతం ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులకు టీ, కాఫీ, పాలు, మజ్జిగ, మంచినీరు, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి అందించారు.
వాహనసేవలను తిలకించేందుకు వీలుగా ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేయగా, భక్తులు శ్రీవారిని దర్శించుకొని గోవిందా నామస్మరణ సాగించారు. భక్తులకు భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా శ్రీవారి సేవకులు, టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది, పోలీసులు, ఎస్‌పిఎఫ్ సిబ్బంది, ఎన్‌సిసి క్యాడెట్లు సేవలందించారు.