Suma Kanakala: సుమ కనకాల పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ యాంకర్ గా కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న సుమ (Suma) సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసింది. ఇదివరకే సుమా పలు సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించారు. అయితే త్వరలో విడుదల కాబోతున్న ప్రేమంటే(Premante) సినిమాల్లో కూడా ఈమె కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో ప్రియదర్శి(Priyadarshi) ఆనంది జంటగా నటించిన ఈ సినిమా లవ్ కామెడీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా నవంబర్ 21వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో సుమా కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమా కనకాల తన కెరియర్ గురించి అలాగే సినిమాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అలాగే ప్రీ రిలీజ్ వేడుకల గురించి సుమ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. సినిమా ప్రీ రిలీజ్ అంటే ఎంతోమంది అతిధులు, అభిమానుల సమక్షంలో జరుగుతుంది. అయితే కొన్నిసార్లు అభిమానులు తమ అత్యుత్సాహం కనబరుస్తూ వేదిక పైకి దూసుకు వస్తుంటారు. తమ అభిమాన హీరోతో ఫోటో దిగాలన్న ఆత్రుతతో ఒక్కసారిగా అభిమానులు వేదికపైకి వచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఇక ఈ విషయాల గురించి సుమ మాట్లాడుతూ.. తాను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటించిన ఓ రెండు సినిమాల ప్రీ రిలీజ్ వేడుకలలో చివరి వరకు ఉండలేదని ఎప్పుడైతే హీరో స్పీచ్ ఇవ్వడం మొదలుపెట్టారో అప్పుడే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాను అంటూ సంచలన విషయాలను బయటపెట్టారు. హీరో స్పీచ్ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ వేదిక పైకి తోసుకు వస్తారు .ఆ టైంలో నేను అక్కడ ఉంటే నన్ను కూడా పచ్చడి చేసేస్తారు అందుకే ముందు జాగ్రత్తతో నేను ఈవెంట్ నుంచి వెళ్ళిపోతానని సుమ తెలిపారు.
బయటకు వెళ్లడానికి దారి వెతుక్కుంటా..
ఈ ఘటన శిల్పకళ వేదికలో జరిగిందని ఈమె తెలిపారు కానీ ఆ సినిమా ఏంటి అనేది మాత్రం వెల్లడించలేదు. అందుకే తాను ప్రీ రిలీజ్ వేడుకలకు వెళితే ముందుగా అక్కడి నుంచి బయటపడటానికి దారి ఎటువైపు ఉంది? కిటికీలు ఎక్కడున్నాయి? అనే విషయాలను గమనించుకుంటాను అంటూ సుమ మాట్లాడిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ సినిమా వేడుక అంటే అభిమానులు ఏ స్థాయిలో తరలి వస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ వేడుకలలో అభిమానులు చేసే హంగామా కూడా మామూలుగా ఉండదు. ఇలా పవన్ అభిమానులు చేసిన రచ్చకు భయపడే సుమ ముందుగానే అక్కడ నుంచి వెళ్లిపోయారని తెలుస్తుంది. ఇక సుమ ఇటీవల బుల్లితెర కార్యక్రమాలను చాలావరకు తగ్గించారు. ప్రస్తుతం ఈమె సినిమా ఈవెంట్లతో క్షణం తీరిక లేకుండా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఒకవైపు యాంకర్ గా కొనసాగుతూనే మరోవైపు నటిగా కూడా సందడి చేస్తున్నారు.
Also Read: Kamakshi Bhaskarala: ఆ పని కోసం స్మశానానికి వెళ్తున్న హీరోయిన్ … ఇదేం అలవాటు రా బాబు!