Dil Raju : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖుల ఇళ్ల పై గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడులు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఐటి రైట్స్ కు సంబంధించిన రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తన నివాసం, కార్యాలయాల్లో జరిగిన ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. తన నివాసం, ఆఫీసుల్లో జరిగిన ఐటీ సోదాలపై తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించి క్లారిటి ఇచ్చారు.. తాజాగా ఈయన ఐటి అధికారుల ఎదుట హాజరైయ్యారు. విచారణలో భాగంగా ఎటువంటి విషయాల గురించి చర్చించారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
కొన్ని రోజుల క్రితం ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజ్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించిన అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. నాలుగు రోజులపాటు దిల్ రాజు ఇంట్లో సోదాలు నిర్వహించారు. దిల్ రాజ్ వ్యాపారాల కు సంబంధించి వివరాలు ఇవ్వాలని ఐటి అధికారులు నోటీసులు ఇచ్చారు. అలాగే సినీ నిర్మాణం , ఎగ్జిబిటింగ్, విడుదల తర్వాత లాభాల వ్యవహారంపై ఆరా తీసినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ బడ్జెట్ సినిమాలను విడుదల చేసారు దిల్ రాజు. గేమ్ ఛేంజర్ ను అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మించారు. వాటన్నటికి ఫైనాన్స్ ఎక్కడ తెచ్చారు, ఎంత తెచ్చారు, అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. దిల్ రాజ్ తో పాటు పలువురు నిర్మాత దర్శకుడు ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఐటీ..
ఇక దిల్ రాజు ఇంట్లో సోదాలు నిర్వహించిన అనంతరం మీడియా తో దిల్ రాజ్ మాట్లాడారు.. వ్యాపారాలకు సంబంధించిన వివరాలు తీసుకురావాలని దిల్ రాజుకు నోటీసులు పంపారు. సినిమాల నిర్మాణం, ఎగ్జిబిషన్ లాభాల వ్యవహారంపై ఐటి అధికారుల ఆరా తీశారు. జనవరి 21 న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఐటి సోదాలు అనేది కామన్.. అకౌంట్ బుక్స్ చెక్ చేసి స్టేట్‌మెంట్ తీసుకున్నారని, మా ఇంట్లో రూ.20 లక్షల లోపే డబ్బులు ఉన్నాయని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గతంలో తెలిపారు.. ప్రస్తుతం ఎటువంటి విషయాల పై చర్చ జరుగుతుందో అనే ఆసక్తి టాలీవుడ్ ప్రముఖుల్లో జరుగుతుంది. ఇక దిల్ రాజు తో పాటుగా టాలీవుడ్ లోని ప్రముఖుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఇక కొద్దిరోజుల్లో మిగిలిన బడా బాబుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్.. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీకి వరుస షాక్ లు తగులుతున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇక దిల్ రాజు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. సమ్మర్ తర్వాత కొత్త ప్రాజెక్ట్ లను అనౌన్స్ చెయ్యనున్నారని సమాచారం..