Kamakshi Bhaskarala: సాధారణంగా మనకు ఏ విషయంలోనైనా కాస్త డిస్టర్బ్ అయితే మనశ్శాంతి కోసం గుడికి వెళ్లడం లేదంటే సరదాగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పలు పర్యాటక ప్రదేశాలకు వెళ్తూ మనశ్శాంతిని వెతుక్కుంటాము. ఇలా మనశ్శాంతి కావాలి అంటే ప్రశాంతమైన వాతావరణంలో గడపాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి కామాక్షి భాస్కరాల(Kamakshi Bhaskarala ) మాత్రం ఇందుకు చాలా విరుద్ధంగా ఉన్నారని చెప్పాలి. ఈమెకు మనసు బాగా లేకపోతే ఏకంగా స్మశానానికి వెళ్తాను అంటూ సంచలనం విషయాలు చెప్పడంతో ఒక్కసారిగా ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పొలిమేర వంటి హర్రర్ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కామాక్షి భాస్కరాల త్వరలోనే “12 ఎ రైల్వే కాలనీ”(12ARailway Colony) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కామాక్షి ఎంతో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ తనకు నిరుత్సాహం కలిగినప్పుడు లేదా మనసుకు శాంతిని బలాన్ని కావాలని కోరుకున్నప్పుడు కచ్చితంగా తాను స్మశానానికి(cemetery) వెళ్తానని తెలిపారు. స్మశానానికి వెళ్లడం ద్వారా నాలో తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుందని కామాక్షి పేర్కొన్నారు.
ఇలా మనశ్శాంతి కోసం స్మశానానికి వెళ్తానని ఈమె చెప్పడంతో ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.. మనశ్శాంతి కోసం దేవాలయాలకు వెళ్లే వారిని చూసాం కానీ ఇలా స్మశానాలకు వెళ్లడం ఏంటి? అయినా ఈ పిచ్చి అలవాటు ఏంటి అంటూ పలువురు ఈమె చేసిన వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఈమె వ్యాఖ్యల పట్ల స్పందిస్తూ ఈమె నటించిన సినిమాలన్నీ కూడా హర్రర్ సినిమాలు కావడంతో బహుశా ఇంకా అదే ట్రాన్స్ లో ఉన్నారేమో అంటూ కామెంట్ చేస్తున్నారు.
హర్రర్ థ్రిల్లర్ గా 12 ఎ రైల్వే కాలనీ..
ఇక ఈమె నటించిన “12 ఎ రైల్వే కాలనీ” సినిమా విషయానికి వస్తే ఈ సినిమా థ్రిల్లర్ జానర్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోగా అల్లరి నరేష్(Allari Naresh) నటించిన బోతున్న సంగతి తెలిసిందే. నాని కసరగడ్డ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు . ఇక ఈ సినిమాలో సాయికుమార్, గెటప్ శ్రీను, వైవా హర్ష, సద్దాం వంటి తదితరులు కీలకపాత్రలలో సందడి చేయనున్నారు. ఇలా నరేష్ కామాక్షి కాంబినేషన్లో హర్రర్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలనే పెంచేశాయి. మరి నవంబర్ 21వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా థ్రిల్ చేస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: Bhagya Shri Borse: రామ్ పోతినేనిలో అదంటే చాలా ఇష్టం… భాగ్యశ్రీ ఆన్సర్‌కి శ్రీముఖి షాక్