BigTV English
Advertisement

Poonam Gupta: రాష్ట్రపతి భవన్ లో పెళ్లి సందడి, ఇంతకీ ఎవరా అదృష్టవంతులు?

Poonam Gupta: రాష్ట్రపతి భవన్ లో పెళ్లి సందడి, ఇంతకీ ఎవరా అదృష్టవంతులు?

Poonam Gupta CRPF: రాష్ట్రపతి భవన్ చారిత్రాత్మ సన్నివేశానికి రెడీ అవుతున్నది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అధికార నివాసంలో తొలిసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్ లో వివాహ వేడుక జరగబోతోంది. ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న అదృష్టవంతురాలు మరెవరో కాదు CRPF అధికారి పూనమ్ గుప్తా. 74వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌ లో పూర్తిగా మహిళలతో కూడిన పరేడ్ టీమ్ ను CRPF అసిస్టెంట్ కమాండెంట్ హోదాలో పూనమ్ గుప్తా లీడ్ చేసింది. ఆమె అసమాన ప్రతిభకు ముగ్దురాలు అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తన అధికారిక నివాసంలో పెళ్లి చేసుకునేందుకు ఆమెకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 12న ఆమె పెళ్లి జరగనుంది.


ఎవరీ పూనమ్ గుప్తా? ఆమె ప్రత్యేకత ఏంటి?  

పూనమ్ గుప్తా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో అసిస్టెంట్ కమాండెంట్‌ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి భవన్‌ లో పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (PSO)గా నియమితులయ్యారు. పూనమ్ గణితంలో బ్యాచిలర్ డిగ్రీ, ఇంగ్లీష్ లిటరేచర్ లో మాస్టర్స్ డిగ్రీ, గ్వాలియర్‌లో ని జివాజీ విశ్వవిద్యాలయం నుంచి BEd పట్టా పొందారు. 2018లో UPSC CAPF పరీక్షలో 81వ ర్యాంక్ సాధించారు. గుప్తా గతంలో బీహార్‌ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతంలో సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నక్సల్స్ ఏరివేతలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం రాష్ట్రపతి భవన్‌ లో విధులు నిర్వహిస్తున్నారు. పూనమ్ గుప్తా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. CRPFకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో పాటు.. విద్యార్థులకు సంబంధించిన మోటివేషన్ పోస్టులను షేర్ చేస్తారు. పూనమ్ మహిళా సమస్యల మీద స్పందిస్తున్నారు. మహిళా సాధికారత కోసం పాటుపడుతున్నారు. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌ ప్రతిదీ ఏదో ఒక విషయం గురించి చర్చించే అవకాశాన్ని కల్పించేలా ఉంటుంది.


రాష్ట్రపతి భవన్‌ లో తొలి వివాహం

యువ అధికా పూనమ్ గుప్తా ఆదర్శప్రాయమైన సేవ, ప్రవర్తనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముగ్ధురాలయ్యారు. పూనమ్ వ్యక్తిగతంగా రాష్ట్రపతి భవన్ లో పెళ్లి చేసుకునేందుకు అనుమతివ్వాలని రిక్వెస్ట్ చేశారు. ఆమె అభ్యర్థనకు వెంటనే రాష్ట్రపతి అంగీకరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్‌ లో వివాహం చేసుకోబోతున్న తొలి వ్యక్తిగా పూనమ్ గుప్తా నిలవబోతున్నారు. CRPF అసిటెంట్ కమాండెంట్ గా సేవలు అందిస్తున్న అవనీష్ కుమార్ తో పూనమ్ గుప్తా వివాహం ఫిబ్రవరి 12న పెళ్లి జరగనుంది. రాష్ట్రపతి భవన్ లోని మదర్ థెరిసా క్రౌన్ కాంప్లెక్స్‌ వివాహ వేడుకకు ముస్తాబు అవుతున్నది. ఈ పెళ్లి కోసం అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఈ పెళ్లి కొద్ది మంది బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తున్నది. పెళ్లికి వచ్చే గెస్టులకు ప్రత్యేకమైన ఇన్విటేషన్ తో పాటు ఎంట్రీ కోసం గుర్తింపు కార్డులు అందిస్తున్నారు. అవి ఉన్న వారిని మాత్రమే రాష్ట్రపతి భవన్ లోపలికి ఆహ్వానించనున్నారు.

Read Also: దేశంలో అత్యధిక మహిళా పోలీసులు ఉన్న రాష్ట్రాలు ఇవే.. ఏపీ ప్లేస్ ఎంతో తెలుసా?

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×