Thiruveer : రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సినిమా విడుదల అయితే, ఆ సినిమాకి సంబంధించిన అసలైన ఫలితం బయటకు రాకముందే సక్సెస్ మీట్ స్పీచ్ లు, సక్సెస్ మీట్ వీడియోలు బయటకు వచ్చేస్తాయి. సాయంత్రానికి టపాసులు కాలుస్తారు. ఒకటి రెండు రోజులు పోయిన తర్వాత ఆ సినిమా ఎంత లాస్ అయిందో రియలైజ్ అవుతారు. రీసెంట్ టైమ్స్ లో ఇది బాగా ఎక్కువైపోయింది.
ఒకప్పుడు సినిమాలకి సంబంధించిన సక్సెస్ మీట్ పెట్టడానికి నిర్మాతలు చాలా ఆలోచించేవాళ్లు. అయితే కొన్ని జెన్యూన్ గా హిట్ అయిన సినిమాలకి టైం తీసుకునే సక్సెస్ ఈవెంట్ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం నటించిన కేరాంప్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. తాజాగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్ర యూనిట్ కూడా సక్సెస్ మీట్ నిర్వహించారు.
నటుడుగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన తిరు వీర్ ప్రస్తుతం తెలుగులో మంచి సినిమాలు చేస్తూ తనకంటూ పేరు సంపాదించుకుంటున్నాడు. అయితే సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర నిజాలు బయటికి చెప్పేసాడు.
మసుద సినిమా నుంచి ఈ సినిమా వరకు నా సినిమాలకు మౌత్ టాకు బాగా కలిసి వస్తుంది. మేము ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ పెట్టడానికి చాలా ఆలోచించాము. థమ్నైల్స్ పెట్టకండి చాలామంది సినిమా రిలీజ్ అయిన సాయంత్రానికే టపాసులు కాల్ చేసి సినిమా హిట్ అని చెప్పుకుంటారు. అలానే కేక్ కట్ చేస్తారు.
మేము అలా ఏమీ చేయలేదు. ఎందుకంటే మా సినిమా హిట్ అని మేము రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది. సినిమా ఫస్ట్ షో కి టికెట్లు పెరుగుతున్న తరుణంలో మాకు ఒక అవగాహన వచ్చి ఊపిరి పీల్చుకున్నాం. ఇక రేపటి నుంచి సినిమాను విపరీతంగా ప్రమోట్ చేస్తాం అని మాట్లాడాడు తిరు.
ఒక సినిమా అందరికీ నచ్చాలి అని రూల్ లేదు అనేది వాస్తవం. అందుకే కొందరికి కొన్ని సినిమాలు నచ్చుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు నచ్చినట్లు సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తే ఇది ఎలా నచ్చింది రా అని కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు.
అయితే ది ప్రీ వెడ్డింగ్ షో సినిమాకి సంబంధించి ఎక్కడా కూడా పెద్దగా నెగిటివ్ కామెంట్స్ వినిపించట్లేదు యునానిమస్ గా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంది. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అని ఎప్పటినుంచో ప్రూవ్ అవుతూ వస్తుంది. ఈసారి కూడా అదే జరుగుతుందేమో చూడాలి.
Also Read: The Great Pre wedding show : యాస తెలియకపోయినా, హీరోని మించిపోయాడు