Deepthi Sunaina: యూట్యూబ్ స్టార్ దీప్తి సునైనా గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టిక్ టాక్ ద్వారా పరిచయమై.. యూట్యూబ్ లో స్పెషల్ సాంగ్స్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.
ఇక యూట్యూబ్ లో దీప్తి పేరు వినిపించింది అంటే పక్కన కచ్చితంగా షన్ను పేరు ఉండాల్సిందే. అప్పట్లో దీప్తి సునైనా – షణ్ముఖ్ జస్వంత్ ప్రేమాయణం తెలియని ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి లేదు.
ఇక దీప్తి తనకు వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ వరకు వెళ్ళింది. నాని హోస్ట్ చేసిన సీజన్ 2 లో ఆమె కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.
బిగ్ బాస్ నుంచి వచ్చాకా అమ్మడు సినిమాల్లో కూడా కనిపించింది. ఇక యూట్యూబ్ లో స్పెషల్ మ్యూజిక్ వీడియోస్ తో దీప్తి మరింత గుర్తింపును తెచ్చుకుంది.
దీప్తి- షన్ను చేసిన వీడియోస్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దీప్తికి వచ్చినట్లే షన్నుకు కూడా బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది. అతను హౌస్ లోకి అడుగుపెట్టేముందే వీరు తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు.
ఇక హౌస్ లో షన్ను- సిరి మధ్య రిలేషన్ ఉందని తెలియడంతో.. హౌస్ నుంచి బయటకు రావడంతోనే దీప్తి.. షన్నుకు బ్రేకప్ చెప్పింది. ఆ తరువాత ఎవరి దారి వారు చూసుకున్నారు.
షన్నుతో బ్రేకప్ తరువాత దీప్తి చాలా కుంగిపోయింది. నిత్యం ఏదో ఒక వీడియో పోస్ట్ చేసే ఆమె.. ఎప్పుడు డల్ గా కనిపిస్తూ ఉండేది. ఇక ఇప్పుడిప్పుడే ఈ చిన్నది ఆ బాధ నుంచి బయటపడుతున్నట్లు కనిపిస్తుంది.
సోషల్ మీడియాలో రోజు తన అందంతో కుర్రకారుకు కిర్రెక్కిస్తూ ఉండే దీప్తి.. తాజాగా చీరలో తన అందాలను ఆరబోసింది. కాటన్ చీర.. నీట్ గా జడ వేసుకొని, కళ్లకు కాటుక పెట్టి వెనుక బ్యాక్ అందాలను చూపిస్తూ షాక్ ఇచ్చింది.
ప్రస్తుతం దీప్తి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. చీరలో ఎంత అందంగా ఉన్నావ్ దీప్తి.. ఆ కాటుక కళ్ళు ఎంత బావున్నాయి. ఇంత అందాన్ని షన్ను ఎలా వదులుకున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.