IND vs AUS 1st Test: టీమిండియా ( Team India) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia) మధ్య జరుగుతున్న పెర్త్ టెస్టులో… బుమ్రా జట్టు అదరగొడుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో… అట్టర్ ఫ్లాప్ అయిన టీమిండియా ఆటగాళ్లు… రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అద్భుతంగా ఆడుతున్నారు. ఈ తరుణంలోనే… రెండో రోజు ఆట ముగిసే సమయానికి… 172 పరుగులు చేసింది టీమిండియా. వికెట్లు ఏమి నష్టపోకుండా 172 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా పై ( Australia) భారీ ఆదిక్యం దిశగా వెళుతుంది.
Also Read: IND vs Aus BGT Trophy: బుమ్రా దెబ్బకు 104 పరుగులకే కుప్పకూలిన ఆసీస్..!
Also Read: Bumrah – Kapil Dev: ఆసీస్ గడ్డపై జస్ప్రీత్ బుమ్రా చరిత్ర..కపిల్ దేవ్ రికార్డు బ్రేక్ !
టీమిండియా. మొత్తంగా ఈ మ్యాచ్ లో 218 పరుగుల లీడ్ సంపాదించింది. మరో 200 పరుగులు… లీడ్ సాధించిన తర్వాత డిక్లేర్ ప్రకటిస్తే ఖచ్చితంగా టీమిండియా గెలిచే ఛాన్స్ ఉంటుంది.ఇక రెండవ ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal ) 90 పరుగులతో రాణిస్తున్నాడు. అటు కేఎల్ రాహుల్ ( Kl Rahul )62 పరుగులు చేసి నిలకడగా ఆడుతున్నాడు. వీరిద్దరూ రేపు కూడా… ఇదే పార్ట్నర్ షిప్ కొనసాగిస్తే.. టీమిండియా కచ్చితంగా భారీ లీడ్ సంపాదించుకోవచ్చు.
Also Read: IND vs AUS 1st Test: పెర్త్ టెస్ట్‌లో చేతులెత్తేసిన టీమిండియా.. 150 పరుగులకే ఆలౌట్
ఇక ఈ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ జంట… 172 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా ( Australia) గడ్డపై 20 సంవత్సరాల తర్వాత 172 పరుగుల భాగస్వామ్యం… సాధించి యశస్వి జైస్వాల్ అలాగే కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించారు. 2004 సంవత్సరం తర్వాత… ఇప్పుడే ఇంతటి స్థాయి రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
Also Read: IPL 2025 schedule: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ తేదీలు ఖరారు..ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే ?
2004 సంవత్సరంలో వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag) అలాగే ఆకాశ చోప్రా ఇద్దరు 123 పరుగులు మాత్రమే చేశారు. అంతేకాకుండా… ఆస్ట్రేలియా దేశంలో 38 సంవత్సరాల తర్వాత 150 కి పైగా ఓపెనింగ్ భాగస్వామ్యం చేసిన భారత బ్యాటర్లు గా రికార్డు సృష్టించారు. 38 సంవత్సరాల కిందట అంటే 1986లో … సునీల్ గవాస్కర్ ( Sunil gavashkar ) అలాగే శ్రీకాంత్ ( Sri kanth ) జోడి మాత్రమే… 191 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.
Also Read: IPL 2025 schedule: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ తేదీలు ఖరారు..ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే ?
ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ ఆడిన… 150 పరుగులకు కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్ లో టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా ( Australia) 104 పరుగులకు కుప్పకూలింది. టీమిండియా కొత్త కెప్టెన్ బుమ్రా దాటికి… ఆస్ట్రేలియా ప్లేయర్లు విలవిల లాడిపోయారు.