Divi (1)
Divi Latest Photos: బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది దివి. 2020లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొని విశేషమైన గుర్తింపు పొందింది. అచ్చ తెలుగు అందంతో క్యూట్ క్యూట్‌గా మాట్లాడుతూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Divi (7)
ముక్కుసూటిగా మాట్లాడుతూ.. టాస్క్‌ల్లో గట్టిపోటీ ఇస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక హౌజ్‌లో చివరి వరకు ఉంటుందనుకున్న ఈ భామ మధ్యలోనే బయటకు వచ్చింది.
Divi (3)
ఈ రియాలిటీ షోతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన.. దివి అంతకు ముందే సినిమాల్లోకి వచ్చిందని చాలా తక్కువ మందికి తెలుసు. మహేష్ బాబు మహర్షి చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిసింది.
Divi (4)
బిగ్‌బాస్ ముందు వరకు దివి మహర్షిలో నటించిందనే విషయం పెద్దగా ఎవరికి తెలియదు. ఈ షోలో ఆమె చెప్పడంతో దివి ఎప్పుడో సినిమాల్లోకి వచ్చిందని తెలిసిందే. ఈ షో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఆమె ఆ తర్వాత చిరు గాడ్‌ఫాదర్‌లో ఓ రోల్ కొట్టేసింది.
Divi (6)
చివరిగా 2024లో వచ్చిన లంబసింగి సినిమాల్లో నటించింది. మరోవైపు ప్రైవేట్ అల్బమ్స్లోనూ నటిస్తోంది. ఇటూ సినిమాలు, అటూ ప్రైవేట్ సాంగ్సతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది.
Divi (5)
తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట అటెన్షన్ కొట్టేస్తుంది. తాజాగా చీరలో బాపు బొమ్మల హోయలు పోయింది. అచ్చ తెలుగు అమ్మాయిలా.. సీ బ్లూ చీర కట్టి, కురులు ముందుకు వేసి.. బాపుగారి బొమ్మల ముస్తాబైంది.
Divi (2)
తారకరామం చదువుతూ అందంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇలా దివిని చూసి సొగసు చూడతరమా.. అని పాడేసుకుంటున్నారు కుర్రకారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.