Thigh Pads: క్రికెటర్లు ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా బలమైన బంతులతో బంతులు వేస్తే క్రికెటర్లకు కచ్చితంగా దెబ్బలు తగ్గుతాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రాక్టీస్ చేస్తున్న క్రికెటర్లు ప్యాడ్స్, హెల్మెట్, అన్ని రకాల పరికరాలు ధరిస్తారు. ముఖ్యంగా థైప్యాడ్స్ కూడా క్రికెటర్లు ధరించి ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ సమయంలోనే కాకుండా, మ్యాచ్ ఆడేటప్పుడు కూడా వీటిని ధరించి బరిలోకి దిగుతారు. అయితే వీటిపై ఉన్న సిగ్నేచర్ గురించి మాత్రం ఎవరికీ తెలియదు. వాటి వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
Also Read: Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండటం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే పనులు ?
క్రికెటర్లు ప్రాక్టీస్ చేసే సమయంలో థైప్యాడ్ లను ( Thigh Pads ) పెట్టుకుంటూ ఉంటారు. అయితే చాలామంది వాడేటువంటి థైప్యాడ్ ల మీద ఒక సిగ్నేచర్ చాలా సందర్భాలలో ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. అయితే ఈ సిగ్నేచర్ ఎవరిది అనే డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. అయితే ఈ సిగ్నేచర్ చేసిన వ్యక్తి పేరు స్టీవ్ రెంఫ్రే. ఇతడు చాలామంది పెద్ద పెద్ద క్రికెటర్లకు, చిన్న క్రికెటర్లకు థైప్యాడ్ లను తయారు చేసి ఇచ్చాడు. అయితే ఈ థైప్యాడ్ లను ( Thigh Pads ) స్టీవ్ తన ఇంట్లోనే తయారు చేస్తూ ఉండేవాడు. అయితే అప్పటికే క్రికెట్లకు చాలా పెద్ద పెద్ద బ్రాండింగ్ కంపెనీల నుంచి థైప్యాడ్ లను ఇచ్చేవారు.
ఇతనికి ఆ సమయంలో పెద్దగా గుర్తింపు లేదు అందుకని తాను తయారు చేసిన థైప్యాడ్ ల మీద రెంఫ్రే అని సిగ్నేచర్ చేసి తయారు చేసేవాడు. చాలామంది క్రికెటర్లకు పెద్ద పెద్ద బ్రాండింగ్ కంపెనీల నుంచి తయారు చేసిన థైప్యాడ్ లు పెద్దగా నచ్చేవి కావు. కానీ స్టీవ్ తయారు చేసిన థైప్యాడ్ ను చాలామంది ఇష్టపడేవారు. చిన్న క్రికెటర్ల నుంచి పెద్ద క్రికెటర్లు అందరూ కూడా ఇతను తయారు చేసిన థైప్యాడ్ లను మాత్రమే వాడేవారు. అంతేకాకుండా చాలా సందర్భాలలో స్టీవ్ తయారుచేసిన థైప్యాడ్ లను వాడమని సలహాలు ఇస్తూ ఉండేవారు. దీంతో స్టీవ్ రెంఫ్రేకు మంచి పేరు లభించింది.
క్రికెటర్లు ప్రాక్టీస్ చేసే సమయంలో థైప్యాడ్ లను ( Thigh Pads ) పెట్టుకుంటే అనేక ఉపయోగాలు ఉంటాయి. అవి ధరించడం వల్ల, తొడలకు గాయాలు కావన్న మాట. ఒక వేళ థైప్యాడ్ లను ( Thigh Pads ) ధరించకపోతే, గాయాలు అయి, మ్యాచ్ లకే దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది. కొన్ని సార్లు కాళ్లు విరిగే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అందుకే విరాట్ కోహ్లీ ( Kohli ), రోహిత్ ( Rohit sharma)లాంటి ప్లేయర్లు వీటిని ధరించడం మనం చూస్తాం.
Also Read: INDW vs ENGW: స్మృతి , హర్మన్ పోరాటం వృధా…సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్..టీమిండియాకు ఇంకా ఛాన్స్
?igsh=MWEwNDdqeXU0MXhkMw%3D%3D