Ayesha On Rithu : బిగ్ బాస్ సీజన్ 9, 7వ వారంలోకి ఎంటర్ అయిపోయింది. ఈరోజు సోమవారం కాబట్టి ఖచ్చితంగా నామినేషన్స్ జరుగుతాయి. ఇప్పుడు నామినేషన్ జరిగిన విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా వీక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ లా అనిపిస్తుంది.
నామినేషన్స్ లో చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఫైర్ స్ట్రామ్ లో భాగంగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఆయేషా. తమిళ బిగ్ బాస్ హౌస్ లో 65 రోజులు ఉన్న ఆయేషా ఇక్కడ కూడా తన గేమ్ ప్రదర్శించే ప్రయత్నాలు చేస్తుంది. వచ్చి రాగానే తనుజ గురించి మాట్లాడింది. ఈరోజు రీతును నామినేషన్ చేస్తూ తన గురించి మాట్లాడిన మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే.
ఆయేషా ఫస్ట్ నుంచి రీతూని టార్గెట్ చేస్తుంది. తనూజ అని చెప్పింది. కానీ, రీతూ విషయంలో ఆమె చాలా రూడ్ గా ఉంటుంది. దివ్య నామినేషన్ ని యాక్సెప్ట్ చేసింది. ఒకే నా ఆటని ఇంప్రూవ్ చేసుకుంటా. నెక్ట్స్ వీక్ చూడు. థ్యాంక్యూ అని నవ్వుతూ చెప్పింది.
కానీ, రీతూని డైరెక్ట్ నామినేట్ చేసింది. రీతూ నామినేట్ చేస్తే.. ఆమెను తీసిపారేసినట్టు చూసింది. ఆమె మాట్లాడుతుంటే సెటైరికల్ రియాక్షన్ ఇచ్చింది. అసలు రీతూ ఏం మాట్లాడిన ఆయేషా భగ్గుమంటుంది. తనకి రీతూ అంటే ఎందుకు పడటం లేదు. ఏమైనా పర్సనల్ గ్రజ్జ్ ఉందా?
అందరితో బాగానే ఉంటుంది, కానీ, ఒక్క రీతూని ఓర్వలేకపోతుంది. ఎందుకు ఆయేషాకి రీతూ అంటే అంత కోపం? అసలు రీతుతో ఉన్న ప్రాబ్లం ఏంటి.? రీతు మాట్లాడుతూ నువ్వు ప్రతి దానికి ఎమోషనల్ అయిపోతావు. బయట నుంచి ఐదు వారాలు గేమ్ చూసి వచ్చి ఇక్కడ ఎవరితో ఉంటే సేఫ్ అని జోన్లో నువ్వు ఉంటున్నావు అని కామెంట్ చేసింది రీతు.
రీతును ఉద్దేశిస్తూ నువ్వు అసలు ఇక్కడికి గేమ్ ఆడటానికి రాలేదు. లవ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి వచ్చావు. నాకు ఒక ఆడియన్ గా నువ్వు అలా కనిపించావు. నువ్వు ఇక్కడ ఉంటే నాకు బాలేదు నువ్వు డైరెక్ట్ గా బయటకు వెళ్లాలి అని నేను అనుకుంటున్నాను అంతే అని తెగించి చెప్పేసింది ఆయేషా.
నామినేట్ చేసినందుకు తనుజ మరియు ఆయేషా మధ్య విపరీతమైన ఆర్గ్యుమెంట్ జరిగింది. మొత్తానికి నీ గేమ్ అయితే బాలేదు అని మరోసారి చెప్పింది ఆయేషా. రీతు చౌదరితో ఆయేషా గొడవపడటం ఇది మొదటిసారి కాదు. వచ్చినప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య ఏవో ఒక ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి.