Emmanuel On Kalyan: బిగ్ బాస్ సీజన్ 9 లో రోజులు గడుస్తున్న కొద్ది రంగులు బయటపడటం మొదలయ్యాయి. ముఖ్యంగా ఇమ్మానుయేల్ మీద అందరికీ ఒక రకమైన మంచి అభిప్రాయం ఉండేది. కానీ నామినేషన్స్ నుంచి కాపాడే అవకాశం ఉన్నప్పుడు చాలా తెలివిగా భరణిను కాపాడుకున్న రాము రాథోడ్ ను కాపాడాడు. తన ఆలోచనలో అలా కాపాడటం మంచిదే. కానీ భరణి వచ్చినప్పటి నుంచి క్లోజ్ గా ఇమ్మానియేల్ తోనే ఉన్నాడు. అటువంటి ఇమ్మానుయేల్ భరణి నామినేషన్ లో ఉంటే సేవ్ చేయకపోవడం అనేది కొంత నెగిటివిటీని ఇమ్మానియేల్ కు తీసుకొస్తుంది అనేది వాస్తవం.
ఇకపోతే నేడు నామినేషన్స్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ నామినేషన్ ప్రక్రియను చాలా కొత్తగా డిజైన్ చేశారు ఇమ్మానుయేల్. దీనిలో ఇమ్మానుయేల్ కి మంచి అవకాశం దక్కింది. బెలూన్ టాస్క్ లో ఇమ్మానుయేల్ ఆడిన విధానం బాగుంది. కొన్ని బెలూన్స్ లో నామినేషన్స్ కి సంబంధించిన టికెట్స్ ఉంటాయి. ఆ టికెట్స్ వాళ్లు వాళ్లకోసం యూస్ చేసుకోవచ్చు లేదంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు.
బెలూన్ టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ కి ఐదు నామినేషన్ స్లిప్స్ దొరికాయి. అందులో అందరికి ఒక్కొక్కటి ఇచ్చాడు. ఇమ్మాన్యుయేల్ తనూజని నామినేట్ చేయాలని అనుకున్నాడు. కళ్యాణ్ నాకు స్లిప్ ఇవ్వు అన్న.. నేను తనూజని నామినేట్ చేస్తా అన్నాడు. కళ్యాణ్ అలా అన్నందుకే నామినేషన్ స్లిప్ తన దగ్గర పెట్టుకోకుండా కళ్యాణ్ కి ఇచ్చాడు.
కానీ, కళ్యాణ్ చివరిలో మాట మార్చి. సంజనను నామినేట్ చేశాడు. వెంటనే ఇమ్మాన్యుయేల్ నువ్వు నాకు చెప్పింది ఏంటీ? నువ్వు చేసింది. తనూజని నామినేట్ చేస్తా అంటేనే నీకు ఇచ్చాను. కానీ, నువ్వు మాట మార్చడం నాకు నచ్చలేదు. నువ్వు తనూజ పేరు చెప్పకుంటే నీకు అసలు స్లిప్ ఇచ్చేవాడిని కాదు.
తనూజని నామినేట్ చేయడానికి నా దగ్గర పాయింట్ ఉంది. నువ్వు ఇలా చేసేవాడికి అయితే. ఆ స్లిప్ నేనే పెట్టుకుని నామినేట్ చేసేవాడిని అని ఇమ్మాన్యుయేల్ ఫీల్ అయ్యాడు. డిమోన్ రీతూలు నీకు చేసింది మోసం అయినప్పుడు.. నువ్వు నాకు చేసింది కూడా మోసమే అని ఇమ్మాన్యుయేల్ ఫీల్ అయ్యాడు.
కానీ ఇక్కడ కళ్యాణ్ తనని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ తన మీద కొన్ని పాయింట్స్ చెప్పేసారు కాబట్టి నేను సంజనా గారిని నామినేట్ చేశానన్న అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ దానికి ఇమ్మానియేల్ పెద్దగా ఒప్పుకోలేదు. వాళ్ల గురించి నాకు అనవసరం. నువ్వు తనుజాని నామినేట్ చేస్తాను అన్నావు కాబట్టి తనుజ మీద నువ్వు ఎలాంటి పాయింట్స్ చెప్తావో అని నేను ఎదురు చూస్తున్నాను. కానీ నువ్వు నన్ను మోసం చేశావు అంటూ ఇమ్మానుయేల్ కళ్యాణ్ పైన ఫైర్ అయ్యాడు.
Also Read: Ayesha On Rithu : రీతూని ఓర్వలేకపోతున్న ఆయేషా.. పర్సనల్ రీవెంజ్ ఏమైనా ఉందా?