NTR: కొన్ని సినిమాలు చూడటానికి చాలా బాగున్నా కూడా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ అందుకోలేవు. అలా కమర్షియల్ అందుకోలేక పోవడానికి పలు రకాల కారణాలు ఉండొచ్చు. అలా సినిమా బాగుంది అని అభిప్రాయాన్ని క్రియేట్ చేసి కమర్షియల్ సక్సెస్ అందుకొని సినిమా ఊసరవెల్లి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా ఊసరవెల్లి. ఈ సినిమాకు అప్పట్లో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కొన్ని కారణాల వలన ఊహించిన రేంజ్ కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది.
శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన దూకుడు సినిమా ఏ రేంజ్ సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా దూకుడు సినిమా కొల్లగొట్టింది. ఆ సినిమాలో మహేష్ బాబు పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ యాసను మహేష్ బాబు మాట్లాడిన విధానం చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంది. దూకుడు ఆ రేంజ్ సక్సెస్ అవడం వలనే ఊసరవెల్లి సినిమా గురించి బయటకు వినిపించలేదు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ను ఈసారి కనుక ఇంకా ప్రకటించలేదు. కానీ ఎస్ఎస్ రాజమౌళి ఒక జపాన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ టైటిల్ రివీల్ చేశారు.
ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం ప్రశాంత్ వర్మ సక్సెస్ రేట్ కూడా ఒకటి. ఈ సినిమా కోసం విపరీతంగా బరువు తగ్గాడు ఎన్టీఆర్.
రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో ఎన్టీఆర్ ను ఒక అభిమాని అన్న ఊసరవెల్లి లాంటి సినిమా చెయ్ అన్న అని అడిగారు. వెంటనే ఎన్టీఆర్ దానికి నవ్వుతూ ఊసరవెల్లి లాంటి సినిమా తీద్దాం అని సమాధానం చెప్పారు.
కొన్నిసార్లు అభిమానులు కొన్ని కోరికలు కోరడం అనేది సహజంగానే జరుగుతుంది. ఆరెంజ్ సినిమా రి రిలీజ్ అయినప్పుడు కూడా, ఆరెంజ్ 2 సినిమా తీయమని దర్శకుడు భాస్కర్ ను కొంతమంది అభిమానులు సంధ్య థియేటర్లో అడిగారు. వెంటనే భాస్కర్ వద్దు బాబోయ్ అన్నట్లు నమస్కారం పెట్టాడు.
అయితే ఊసరవెల్లి లాంటి సినిమా తీసినప్పుడే కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. మళ్లీ అలాంటి సినిమా చేద్దాం అని ఎన్టీఆర్ అంటుంటే అది చాలామందికి రిస్కులా అనిపిస్తుంది. అందుకే కొంతమంది అంత రిస్కు మళ్ళీ వద్దులే అన్న అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెడుతున్నారు.
Also Read: Mari Selvaraj: నేను నీకు మద్యం ఇవ్వడం లేదు, నా సినిమా అలా చూడకు