Lalit Modi – Yuvraj :టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ 2007 తొలి టీ-20 వరల్డ్ కప్ లో 6 బంతుల్లో 6 సిక్స్ లు కొట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆరు సిక్స్ ల గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకున్న విషయం విధితమే. దీంతో ఐపీఎల్ వ్యవస్థాపకుడు అప్పట్లో యువరాజ్ సింగ్ కి పోర్షే కారును బహుమతిగా ఇస్తానని ప్రకటించాడట. అనుకున్నట్టుగానే లలిత్ మోడీ యువరాజ్ కి కారును బహుమతిగా ఇచ్చాడట. ఇంగ్లండ్ కి చెందిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో 6 బంతుల్లో 6 సిక్స్ లు బాది పెను సంచలనంగా మారాడు యువరాజ్ సింగ్. ఎవరైనా ఒక ఓవర్ లో 6 బంతుల్లో 6 సిక్సర్లు లేదా 6 బంతుల్లో 6 వికెట్లు తీస్తే స్వయంగా తాను పోర్స్చే ఇస్తానని ప్రకటించాడు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2007 టీ-20 వరల్డ్ కప్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
టీమిండియా విజయం సాధించిన తరువాత ఇండియాలో ఐపీఎల్ ప్రారంభం అయింది. బ్రాడ్ బౌలింగ్ లో యువరాజ్ 6 బంతుల్లో 6 సిక్స్ లు కొట్టడం చరిత్ర సృష్టించిందని Beyond23CricketPod పోడ్‌కాస్ట్‌లో లలిత్ మోడీ వెల్లడించారు. మరోవైపు ఇటీవలే ఐపీఎల్ లో శ్రీశాంత్-హర్భజన్ సింగ్ గొడవ గురించి కూడా చెప్పడంతో అది వివాదం మారి.. శ్రీశాంత్ భార్య లలిత్ మోడీ పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. యువరాజ్ సింగ్ బౌండరీలో నన్ను చూస్తూ బ్యాట్ పైకి లేపాడని.. నాకుపోర్షే కావాలి అని అడిగినట్టు గుర్తు చేశాడు లలిత్ మోడీ. సోషల్ మీడియాలో లలిత్ మోడీ ఈ విషయం పై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. లలిత్ మోడీ డబ్బులు సంపాదించడానికే రకరకాలుగా చెబుతున్నాడని మండిపడుతున్నారు. కారును గిప్ట్ గా ఇచ్చినప్పటికీ.. ఆ తరువాత ఐపీఎల్ తీసుకొచ్చి భారీగా డబ్బులు సంపాదించారు. ఐపీఎల్ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు మరోవైపు లలిత్ మోడీ డబ్బులు సంపాదించడానికి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ Beyond23CricketPod పోడ్‌కాస్ట్‌లో లలిత్ మోడీ రకరకాల కామెంట్స్ చేస్తున్నారని కొందరూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. లలిత్ మోడీ మాస్ట్ ప్లాన్ గురించి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.
వాస్తవానికి భారత క్రికెట్ వ్యాపారంలో ఐపీఎల్ లో అవినీతికి పాల్పడ్డాడని అతని పై ఆరోపణలు వినిపించాయి. అతన్ని రకరకాల ప్రశ్నలు అడగడంతో అతను కొన్నింటిని సమర్థించడం గమనార్హం. అందులో కొన్నింటిని తప్పుదారి పట్టించాడు. కొన్నింటినీ అంగీకరించాడు. అప్పటి నుండి టోర్నమెంట్ స్థాయి మరియు డబ్బు సంపాదించే సామర్థ్యం పెరిగింది. 2007లో టీమిండియా కి ప్రధాన ఆటగాళ్లు ఆడటం లేదు. కొత్త ఆటగాళ్లు ఆడుతున్నారు వీళ్లు కొడతారు లే. అనుకొని ఎవ్వరూ వరుసగా 6 సిక్సర్లు కొట్టినా.. 6 వికెట్లు తీసినా జేబులో నుంచి డబ్బు తీసి పోర్స్యే కారును తెస్తాను అని చెప్పాడు. యువరాజ్ 6 సిక్సర్లు కొట్టడంతో ఇదే ఊపులో ఐపీఎల్ ని ప్రారంభించారు. ఐపీఎల్ లో అందరినీ ఆకర్షించింది. ఇప్పటికీ ఐపీఎల్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
?igsh=emVoZWpwZmlteWd5