BigTV English

Bigg Boss 9 Nomination List: ఆయేషా సేవ్.. నామినేషన్ లో మొత్తం 8 మంది.. ఎవరెవరు ఉన్నారంటే..

Bigg Boss 9 Nomination List: ఆయేషా సేవ్.. నామినేషన్ లో మొత్తం 8 మంది.. ఎవరెవరు ఉన్నారంటే..
Advertisement


Bigg Boss 9 7th Week Nomination: వీక్ నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ కొత్త ప్లాన్ చేశాడు. ఎప్పటిలా నామినేషన్ రైట్స్ అందరికి ఇవ్వకుండ కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. హాల్ లో నిండా ఎల్లో, గ్రే బెలూన్ పెట్టి వాటిని పగలగొట్టే టాస్క్ ఇమ్మాన్యుయేల్, ఆయేషాకి ఇచ్చాడు బిగ్ బాస్. ఇమ్మాన్యుయేల్ దగ్గర పవర్ అస్త్రా, ఆయేషా దగ్గర నామినేషన్ పవర్ ఉండటం వల్ల ఫైర్ స్ట్రోమ్స్, ఓజీల నుంచి ఒక్కొక్కరిని పంపించాడు. బిగ్ బాస చెప్పినట్టుగా బెలూన్ల అన్ని పగలగొట్టి వాటిలో ఉన్న స్లిప్ కవర్స్ ని తీసుకోవాలి. టాస్క్ పూర్తయ్యే సరికి ఇమ్మాన్యుయేల్ కి ఐదు, ఆయేషాకి మూడు స్లిప్స్ దొరికాయి. అయితే అంతకంటే ముందు బిగ్ బాస్ ఇద్దరు కెప్టెన్స్ కి స్పెషల్ పవర్ ఇచ్చాడు. వారి ముందు బ్లూ అండ రెడ్ పిల్స్ పెట్టాడు. అందులో వీరిద్దరు ఒక్కొక్కటి సెలక్ట్ చేసుకోమని చెప్పగా.. గౌరవ్ బ్లూ, సుమన్ రెడ్ సెలక్ట్ చేసుకున్నారు.

కెప్టెన్స్ కి స్పెషల్ పవర్

గౌరవ్ పిల్ లో ఒకరిని సేవ్ సమ్ వన్ ఉంది, సుమన్ పిల్ లో సేవ్ యువర్ సెల్ఫ్ వచ్చింది. దీంతో ఈవారం నామినేషన్ నుంచి సేవయ్యాడు సుమన్. ఇక బెలూన్ టాస్క్ లో దొరికిన నామినేషన్ స్లిప్ లో ఇమ్మాన్యుయేల్ తనకు వచ్చిన ఐదింటీని హౌజ్ మేట్స్ కే ఇచ్చాడు. ఒక్కటి కూడా తను ఉంచుకోలేదు, ఆయేషా మాత్రం డైరెక్ట్ నామినేషన్ స్లిప్ తనే ఉంచుకుని సాయికి, సంజనలకు ఒక్కొక్కటి ఇచ్చింది. ఇక ఇమ్మూ ఒక్కక్కొ నామినేషన్ ఉన్న స్లిప్స్ తనూజ, రమ్య, కళ్యాణ్ లకు ఇచ్చాడు. రెండు నామినేషన్స్ స్లిప్స్ రెండింటిని.. దివ్య, రీతూకి ఇచ్చాడు. వాటి ఆధారం నేటి నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇక నామినేషన్ ప్రక్రియ మొదలైంది. డైరెక్ట్ నామినేషన్ స్లిప్ అందుకున్న ఆయేషా.. రీతూని నామినేట్ చేసింది. ఆమె ఓవరాక్షన్, ఫౌల్ గేమ్స్, లవ్ ట్రాక్స్ మాత్రమే కనిపిస్తున్నాయని, పెద్దగా ఆట కనిపించడం లేదంటూ రీతూని నేరుగా నామినేట్ చేసింది ఆయేషా.


రీతూ, దివ్యలకు డబుల్ నామినేషన్

ఆ తర్వాత దివ్య.. ఇమ్మాన్యుయేల్ ఇచ్చిన డబుల్ నామినేషన్ స్లిప్ పవర్ తో ఇద్దరిని నామినేట్ చేసింది. ఒకరు సాయి, మరోకరు ఆయేషా. సాయికి గేమ్ పెద్దగా లేదని, తను ఎదుటి వాళ్ల ఓపినియన్ ఏంటో చెప్పకముందే వినకుండ మాట్లాడేస్తున్నారు.. హైపర్ ఎక్కువ అంటూ సాయిని నామినేట్ చేసింది. అలాగే ఆయేషాకు ఎదుటి వాళ్లలో ఎలా తప్పులు ఏంచి చెబుతుందో.. అలాగే తనలో కూడా తప్పులు ఉంటాయని, వాటిని ఎదుటి వాళ్లను చెప్పినప్పుడు ఆక్సెప్ట్ చేయాలని సూచించింది. నిన్న హైపర్ ఆది చేసిన కామెంట్స్ తీసుకోలేకపోయిందని, ఆయన ఎవరూ నాకు వచ్చి చెప్పడానికి ఈ హౌజ్ నుంచి వెళ్లిపోతా అంటూ డ్రామా చేసిందనే విషయాన్ని నామినేషన్ లో బయటపెట్టింది సంజన. అలా దివ్య సాయి, ఆయేషాలను నామినేట్ చేసింది. ఆ తర్వాత సాయి వంతు రాగా.. కళ్యాణ్ ని నామినేట్ చేశాడు. తన పవర్ అస్త్రా ని తీసేయాలని నాగ్ సర్ చెప్పడం కరెక్ట్ కాదని కారణంతో ఈ నామినేషన్ వేశానంటూ దీనికి వివరణ ఇచ్చాడు.

ఆయేషా సేవ్.. నామినేషన్ ఉంది వీరే

ఆ తర్వాత రీతూ.. ఆయేషా, రాములను నామినేట్ చేసింది. తనపై చేసిన లవ్ ట్రాక్ కామెంట్స్, ఆట ఆడటం లేదే అవే కారణాలు ఆయేషాలోనూ ఉన్నాయని, ముందు నీ గేమ్ చూసుకో అంటూ ఆయేషాని, ఫైర్ స్ట్రోమ్స్ వచ్చాక అసలు రాము ఆట కానీ, రాము కానీ, హౌజ్ కనిపించలేదంటూ అతడిని రీతూ నామినేట్ చేసింది. హౌజ్ లో తను కనింపచడం లేదన్న దానికి అయితే కళ్లు చెక్ చేసుకో అంటూ రీతూ కౌంటర్ ఇచ్చాడు రాము రాథోడ్. ఆ తర్వాత తనూజ.. రమ్యని, రమ్య తనూజని నామినేట్ చేసుకున్నారు. కళ్యాణ్ సంజనని.. సంజన-దివ్యని నామినేట్ చేసింది. ఈ ప్రక్రియ ముగిసే సరికి మొత్తం తొమ్మిది మంది నామినేషన్ లో ఉన్నారు. అయితే కెప్టెన్ గౌరవ్ కి ముందుగా వచ్చిన పవర్ ని ఈ సందర్భంగా బిగ్ బాస్ వాడమని చెప్పాడు. ఈ పవర్ ని ఆయేషాకి ఇచ్చాడు. దీంతో ఆయేషా.. ఈ నామినేషన్ నుంచి బయటపడింది. దీంతో ఈ వారం హౌజ్ నుంచి బయటకు వెళ్లేవారిలో మొత్తం ఎనిమిది మంది నిలిచారు. రీతూ, సాయి, రాము రాథోడ్, తనూజ, దివ్య, కళ్యాణ్, రమ్య, సంజనలు నామినేషన్ ఉన్నారు.

Related News

Bigg Boss 9: నామినేషన్స్ రచ్చ.. రీతూకి రాము కౌంటర్, ఇమ్మాన్యుయేల్ కి గట్టి షాక్

Emmanuel On Kalyan: కళ్యాణ్ ని నమ్మి మోసపోయిన ఇమ్మాన్యుయేల్.. నామినేషన్ లో వెన్నుపోటు

Ayesha On Rithu : రీతూని ఓర్వలేకపోతున్న ఆయేషా.. పర్సనల్ రీవెంజ్ ఏమైనా ఉందా?

Moksha Ramya On Thanuja : వామ్మో జుట్లు పట్టుకునే స్టేజ్ కు వెళ్ళిపోతున్నారు, పచ్చళ్ళ పాప ఘాటు కౌంటర్స్ 

Bigg Boss 9 Promo: విశ్వరూపం చూపించిన తనూజ.. విజిలేసి మరి రమ్య, మాధురికి ఇచ్చిపడేసింది..

Thanuja: కన్నింగ్ కు కేర్ అఫ్ అడ్రస్, మరి ఇంతలా నటించాలా?

Bigg Boss 9 Winner: విన్నర్ ఎవరో చెప్పేసిన హైపర్ ఆది.. ఈసారి టైటిల్ ఆమెదే, టాప్ 5లో రీతూ పక్కా!

Big Stories

×