Bigg Boss 9 Today Episode: భరణి ఎలిమినేట్ తో తనూజ, దివ్యలు ఫుల్ ఎమోషనల్ అయ్యారు. మనం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్.. ఇప్పటి వరకు బాండింగ్స్ పేరుతో మనల్ని టార్గెట్ చేశారు. నువ్వు వచ్చాక నాకు జెలసీ వచ్చిందన్నారు. అవన్ని వదిలేసి ఇక గేమ్ పై ఫోకస్ పెడదాం. అని తనూజ దివ్యని ఓదార్చింది. ఇక నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం ఇమ్మాన్యుయేల్, ఆయేషాలు వారి వారి దగ్గర ఉన్న స్లిప్స్ ని వారికి నచ్చివాళ్లకు ఇవ్వాలి. దీంతో ఇమ్మాన్యుయేల్ తన దగ్గర ఉన్న నామినేషన్ స్లిప్స్ ని ఒక్క ఒక్క నామినేషన్ ఉన్న స్లిప్స్ ని ఒకటి కళ్యాణ్, ఒకటి రమ్య, ఒకటి తనూజ, ఇద్దరి నామినేట్ చేసే స్లిప్స్ లో ఒక్కొక్కటి దివ్య, రీతూకి ఇచ్చాడు. ఇక ఆయేష డైరెక్ట్ నామినేషన్ స్లిప్ ని తన దగ్గర పెట్టుకుని ఒకటి సాయి, ఒకటి సంజనకు ఇచ్చింది. పంపకాలు అయిపోయాక.. నామినేషన్ ప్రక్రియ మొదలైంది.
ఆయేషాతో నామినేషన్స్ మొదలయ్యాయి. ఇంట్లో నీ ఓవరాక్షన్, లవ్ ట్రాక్స్ చూడలేపోతున్నానని, నీకు హౌజ్ లో ఉండే అర్హత లేదంటూ రీతూని నామినేట్ చేసింది. తన పాయింట్స్ చెప్పి వెళ్లి కూర్చుంది. కానీ, రీతూ వివరణ మాత్రం వినేందుకు ఇష్టపడలేదు. నన్ను స్ట్రాంగ్ అనే కంటెండర్ నుంచి తీసుకోలేదు ఇప్పుడేంటి ఇలా అంటున్నావ్ అని ప్రశ్నించింది. ఆటలో నీ అహంకారం, ఫౌల్ గేమ్ వల్లే తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇలా ఇద్దరి మధ్య మాట మాట పెరిగి పెద్ద వాదన జరిగింది. ఆ తర్వాత దివ్య ఆయేషాని నామినేట్ చేసింది.
ఒక మాట ఒకరిని అన్నప్పుడు మనం కూడా ఎదుటివారి మాటలను కూడా మనం తీసుకోవాలి. ఎదుటి వాళ్లపై నీకు మాత్రమే కాదు ఎదుటి వాళ్లకు కూడా నీపై ఓ అభిప్రాయం తీసుకోవాలి. నువ్వు ఎవరినైతే అంటున్నావ్ అలాంటి ఫౌల్స్ మన దగ్గర లేకుండ చూసుకోవాలని చెప్పింది. కాబట్టి ఇకనైనా నీ పాయింట్ ఆఫ్ వ్యూ మార్చుకుని ఆడాలని కోరుకుంటున్నా అని చెబితే. ముఖ్యంగా నీ కోపాన్ని తగ్గించుకోమని చెప్పింది. దివ్య నామినేషన్ నవ్వుతూ యాక్సెప్ట్ చేసింది. తన తన హైపర్ పూర్తిగా తగ్గించుకోలేను కానీ, కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తానంది. ఆ తర్వాత దివ్య, సాయిని నామినేట్ చేసింది.
ఆ తర్వాత రీతూ వంతు వచ్చింది. తన ఫస్ట్ నామినేషన్ గా ఆయేషాను నామినేట్ చేసింది. తను లవ్ ట్రాక్, ఒకరి అండతో గెలుస్తున్న అంటున్నావ్. కానీ, నువ్వు ఆడిందేంటి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావ్, ఒక్కరి మాట వినవ్ అంటూ రీతూ ఆయేషాకి తన పాయింట్స్ చేసింది. నువ్వు ఓవరాక్షన్ చేస్తూ పక్కనవాళ్లని అంటే ఎవరూ పడరంటూ చురక అట్టించింది. ఇలా ఇద్దరి మధ్య మీన యుద్దమే జరిగింది. జుట్టు జుట్టు పట్టుకునే కొట్టుకునేవరకు వెళ్లారు ఇద్దరు. ఆ తర్వాత లాస్ట్ వీక్ అసలు తన గేమ్, తను కనిపించలేదనే కారణంతో రీతూ రాముని నామినేట్ చేసింది. దీంతో అయితే నువ్వు కళ్ల చేకప్ చేయించుకో అంటూ కౌంటర్ ఇచ్చాడు. ః
అంతేకాదు సపోర్టు లేకుండ ఆట ఆడలేని నువ్వు.. నన్ను నామినేట్ చేస్తున్నావా అంటూ వెటకరించాడు. ఆ తర్వాత సాయి వంతు రావడంతో అతడు కళ్యాణ్ ని నామినేట్ చేశాడు. తన పవర్ ని తీయాలని చూసినందుకు తనని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. తన గేమ్ విషయానిక వస్తే తనదే కాదు.. మిగతా ఐదుగురి పవర్ కూడా తీసేందుకు తాను రెడీ అని సవాలు విసిరాడు. ఆ తర్వాత రమ్య వంతు వచ్చింది. తనూజ ఫేక్ గేమర్ అని, మాస్క్ తో ఆడుతున్నావంది. నువ్వు పెద్ద డ్రామా క్వీన్ అంటూ తనూజని నామినేట్ చేసింది. మొదటి నుంచి ఇప్పటి వరకు ఒక్క టాస్క్ కూడా నీ సొంతంగా ఆడలేదంటూ తనూజని నామినేట్ చేసింది.
ఒకరిని బాధ పెట్టాలని, ఇద్దరి మధ్య మంట పెట్టాలనే హౌజ్ కి వచ్చావా.. ఇంకొకరికి చెప్పేముందు, నీ గేమ్ ఏంటో నువ్వు చూసుకో అంటూ చురక అట్టించింది తనూజ. నువ్వు పెద్ద ఫేక్ అని, నీలా ఉండలేను, బాండింగ్ ల కోసం హౌజ్ రాలేదంటూ తనూజకి తిప్పికొట్టింది రమ్య. నువ్వు నాలా ఉండలేవు.. ఉండవు కూడా అంటూ రమ్యకి గట్టిగా ఇచ్చిపడేసింది. దీంతో రమ్య తన మాటలతో రెచ్చిపోయింది. బిగ్ బాస్ ని లవ్వుల పార్క్ లా చేశావని, జెలస్ రాణి అంటూ తనూజకి బిరుదులిచ్చింది. ఆ తర్వాత రెండు చేతులు కలిస్తేనే క్లాప్స్ కదా.. వచ్చిందా సౌండ్ అంటూ మాధురి, రమ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చింది. రెండు చేతులు కలిపి కొడితే వచ్చే సౌండ్ కన్న.. సింగిల్ హ్యాండ్ తో వేసే విజిల్ .. సౌండ్ గట్టిగా వినిపిస్తుంది.. అంటూ మాధురి చూస్తూ తనూజ సవాలు చేసింది.
Also Read: Bigg Boss 9 Promo: విశ్వరూపం చూపించిన తనూజ.. విజిలేసి మరి రమ్య, మాధురికి ఇచ్చిపడేసింది..
అయితే తనూజ మాటలకు మాత్రం మాధురి మన్ను తిన్న పాములా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత కళ్యాణ్ సంజనని నామినేట్ చేశాడు. ఐదు వారాలకు ఉన్న తన గేమ్ ఫైర్ స్ట్రోమ్స్ వచ్చాక కనిపించడం లేదని.. మళ్లీ మీ ఆటపై ఫోకస్ పెట్టాలని కళ్యాణ్ నామినేట్ చేశాడు. అయితే ఇక్కడ ఇమ్మాన్యుయేల్ కి ఇచ్చిన మాట తప్పాడు కళ్యాణ్. తనూజని నామినేట్ చేస్తా అని చెప్పి సంజను చేయడంతో ఇమ్మూ షాక్ అయ్యాడు. ముందు ఒక మాట చెప్పి ఇప్పుడెందుకు మార్చవని, నువ్వు ఇలా మాట మార్చదైయితే అసలు నీకు నామినేషన్ హక్కు ఇచ్చేవాడిని కాదన్నాడు. తనూజని నామినేట్ చేస్తానని చెప్పి నన్ను మోసం చేశావ్ అంటూ కళ్యాణ్ పై ఇమ్మాన్యుయేల్ ఫైర్ అయ్యాడు. చివరిగా సంజన.. దివ్యను నామినేట్ చేసింది. దీంతో ఈ వారం నామినేషన్ లో మొత్తం తొమ్మిది మంది నామినేషన్ లో ఉండగా.. కెప్టెన్ గౌరవ్ స్పెషల్ పవర్ తో ఆయేషాని సేవ్ చేశాడు. దీంతో ఎమిమిది మంది నామినేషన్ లో నిలిచారు. రీతూ, సాయి, రాము, కళ్యాణ్, దివ్య, తనూజ, రమ్య, సంజనలు ఈ వారం