ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ChatGPT. ఇప్పటి వరకు సమాచారాన్ని మాత్రమే అందించగా, ఇకపై కొత్త పనులు చేయబోతోంది. తమ వినియోగదారులతో శృంగార సంభాషణలు కూడా చేయబోతోంది. డిసెంబర్ నుండి ఈ అవకాశం అందుబాటులోకి రానున్నట్లు OpenAI వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్ మాన్ ప్రకటించారు. అయితే, జనరేటివ్ AIని లైంగికీకరించడం గురించి ఆందోళనకరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజాగా సోషల్ మీడియాలో మాట్లాడిన OpenAI వ్యవస్థాపకుడు ఆల్ట్ మాన్.. డిసెంబర్ నాటికి శృంగార కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేయడానికి చాట్ బాట్ రెడీ అవుతుందన్నారు. అయితే, ఈ సర్వీస్ కేవలం పెద్దలకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. శృంగారవాదం అనే అంశాన్ని విద్యా, మానసిక దృక్పథం నుంచి సంప్రదించడం పూర్తిగా సాధ్యమేనన్నారు. అయితే, ఈ కొత్త రంగంలో ChatGPT మాత్రమే ప్లేయర్ కాదు. రెప్లికా పేమెంట్ వెర్షన్ ఇప్పటికే, తమ వినియోగదారులకు ఈ రకమైన సర్వీస్ అందిస్తుంది.
ఇక ఆల్ట్ మాన్ తాజా నిర్ణయంపై పలువురు టెక్ నిపుణులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. “ప్రజలు ఏమి వినాలనుకుంటున్నారో, అది ఎలా చెప్పాలో అతనికి తెలుసు. ఈ రకమైన సంభాషణలు చేయడానికి ఆపిల్ సిరి, అమెజాన్ అలెక్సాపై ఉన్న పరిమితులను అధిగమించడానికి ప్రజలు ప్రయత్నిస్తున్నారని ఆల్ట్ మాన్ గమనించాడు. డబ్బు సంపాదించవచ్చని అతను భావించాడు” అంటున్నారు. “ప్రజలను ఆకర్షించడానికి, వారి ప్లాట్ ఫామ్ కు ఎక్కువ మంది వినియోగదారులను తీసుకురావడానికి ఇది మంచి అవకాశం కానుంది” అని కార్డిఫ్ విశ్వవిద్యాలయం AI నిపుణుడు సైమన్ థోర్న్ అన్నారు.
అటు ఆల్ట్ మాన్ ప్రకటన తర్వాత ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. “మేము ప్రపంచంలో ఎన్నుకోబడిన నైతిక పోలీసులం కాదు” అని ఆల్ట్ మాన్ తన నిర్ణయాన్ని సమర్థిస్తూ Xలో పోస్టు పెట్టారు. “సమాజం ఇతర సముచిత సరిహద్దులను వేరు చేసే విధంగానే మేము ఇక్కడ కూడా ఇలాంటిదే చేయాలనుకుంటున్నాం” అన్నారు. అదే సమయంలో ChatGPT దుర్వినియోగాన్ని నివారించేందుకు రక్షణ ఏర్పాట్లు చేస్తామని OpenAI ప్రకటించింది. అయితే, ఈ చాట్ బాట్‌ల క్రియేటర్స్ నిర్దేశించిన పరిమితులను అధిగమించడం తరచుగా సాధ్యమేనని. శృంగార చర్చల విషయానికి వస్తే, సమస్యాత్మకమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్ సృష్టికి దారితీస్తుందని పలువురు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. “ఏది అనుమతించబడుతుంది, ఏది అనుమతించబడదు అనే దానిపై చట్టాలు తరచుగా ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. OpenAI సాధారణ నియమాలను రూపొందించడం చాలా కష్టం” అంటున్నారు. మరోవైపు “ఇటీవలి UK అధ్యయనం ప్రకారం యువత చాట్ బాట్ ల ప్రకటనలు విశ్వసనీయమైనవిగా నిజమైన వ్యక్తులుగా చెప్పే మాటలుగా పరిగణించే అవకాశం ఎక్కువగా ఉంది” అని తేలిందంటున్నారు. ఈ నిర్ణయాన్ని ఆల్ట్ మాన్ అమలు చేసే విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి అవసరం ఉందంటున్నారు.
Read Also: 36 వేల అడుగుల ఎత్తులో విమానాన్ని ఢీకొట్టిన గుర్తుతెలియని వస్తువు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?