Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి రికార్డులు సాధించిన మొనగాడు విరాట్ కోహ్లీ. అయితే అలాంటి విరాట్ కోహ్లీకి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన ఆటగాడు చుక్కలు చూపించాడు. డేంజర్ ఆల్ రౌండర్ కావాల్సిన విరాట్ కోహ్లీ కెరీర్ ను నాశనం చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన ఆల్బీ మోర్కెల్ ( Albie Morkel ). అతని ఓవర్ లో ఏకంగా 28 పరుగులు సాధించి.. మరోసారి విరాట్ కోహ్లీ బౌలింగ్ వేయకుండా చేసాడు ఆల్బీ మోర్కెల్. అంతేకాదు, ఆ దెబ్బకు కోహ్లీ ప్రాతినిద్యం వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore ) కూడా భారీ స్కోర్ చేసినా ఓడిపోయింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: INDW vs ENGW: స్మృతి , హర్మన్ పోరాటం వృధా…సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్..టీమిండియాకు ఇంకా ఛాన్స్
పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ ( Virat Kohli ) సాధించని రికార్డులు లేవు. అతడు చేరుకొని మైలు రాళ్లు కూడా లేవు. అయితే అలాంటి విరాట్ కోహ్లీకి నిద్ర లేకుండా చేశాడు సౌత్ ఆఫ్రికా డేంజర్ ఆల్ రౌండర్ ఆల్బీ మోర్కెల్. 2012 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( Indian Premier League 2012 ) సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Chennai Super Kings vs Royal Challengers Bangalore ) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 205 పరుగులు చేసింది. దీంతో కచ్చితంగా రాయల్ చాలెంజ్ బెంగళూరు గెలుస్తుందని అందరూ అనుకున్నారు.
కానీ, ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( Chennai Super Kings ) అద్భుతంగా విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 19 వ ఓవర్ సమయంలో ఆల్బీ మోర్కెల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అప్పుడు విరాట్ కోహ్లీకి బౌలింగ్ ఇచ్చారు. అయితే విరాట్ కోహ్లీ వేసిన తొలి బంతికే బౌండరీ కొట్టాడు ఆల్బీ మోర్కెల్. ఆ బౌండరీ కొట్టాడని కాస్త స్లెడ్జింగ్ చేశాడు విరాట్ కోహ్లీ. ఇంకేముంది రెచ్చిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ ఆల్బీ మోర్కెల్ ( Albie Morkel ), ఆ ఓవర్ లో 28 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత చివరి ఓవర్ లో రవీంద్ర జడేజా బౌండరీ కొట్టి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును గెలిపించాడు. దీంతో విరాట్ కోహ్లీ అప్పటి నుంచి బౌలింగ్ చేసేందుకు వణికిపోతున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ టోర్నమెంట్ లో మాత్రం కోహ్లీ బౌలింగ్ చేయడం లేదన్న సంగతి తెలిసిందే.
Also Read: Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండటం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే పనులు ?
?igsh=MXZqa3hoeGRkM2UzZw%3D%3D