Moksha Ramya On Thanuja : బిగ్ బాస్ సీజన్ 9 లో నామినేషన్ డే వచ్చేసింది. చాలామంది ప్రేక్షకులు కూడా నామినేషన్ డే గురించే ఎదురు చూస్తారు. ఎందుకంటే నామినేషన్స్ డే రోజు ఒకరి గురించి ఒకరు మాట్లాడుతున్న తరుణంలో వాళ్ల ఒరిజినల్ కలర్స్ బయటపడతాయి. ఈరోజు నామినేషన్స్ లో కూడా అదే జరిగింది.
రమ్య మోక్ష తనుజను నామినేట్ చేస్తూ ఆసక్తికర పాయింట్స్ తెలియజేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రమ్య మోక్ష తెలియజేసిన పాయింట్స్ లో కొన్ని నిజాలు కూడా ఉన్నాయి.
నువ్వు ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకు ఒక టాస్క్ కూడా ఆడలేదు. ఎవరో ఒకరు నీకు ఇలా తీసుకొచ్చి అలా పెడితే గాని నువ్వు ఆడ లేవు. అలా చేసిన కూడా నువ్వు గెలవలేవు. నీ అంతట నువ్వు ఓన్ గా గేమ్ ఆడలేవు ఎవరైనా నీకు హెల్ప్ చేయాలి. నువ్వు దేనికి వచ్చావు? ఒక బాండింగ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ బాండ్స్ వలన అలా సాఫీగా బిగ్బాస్ హౌస్లో సో సో గా వెళ్ళిపోవాలి దీని కోసమే నువ్వు వచ్చావు.
నువ్వు మాత్రం ఇంట్లో బాగానే ఉంటున్నావు. నిన్న భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు. నీ గేమ్ వలన వేరే వాళ్ళకి నష్టం జరుగుతుంది. నువ్వైతే బానే ఉన్నావ్. నీ నామినేషన్స్ నేను అబ్జర్వ్ చేస్తా, ఒకటి కూడా ఫెయిర్ ఉండదు. సుమన్ గారిని నువ్వు నామినేట్ చేశావు. అంటే ఏంటి ఎవరు దిక్కు లేక, బాండింగ్స్ ని కాపాడుకోవడం కోసం, సుమన్ గారిని నామినేట్ చేసావ్ రీజన్ ఏమో మీరు యాక్టివ్ గా ఉండట్లేదు అని చెప్పావు.
నువ్వు బ్యాక్ బిచ్చంగ్ కూడా చేస్తావ్. నాన్న నాన్న అంటే వెనక్కి వెళ్లి ఇంకొకటి మాట్లాడుతావ్. నువ్వు ఒక ముసుగులో ఉన్నావు దాని నుంచి బయటికి రా. నువ్వు ఫుల్లు డ్రామా క్వీన్. ఎప్పుడు చూసినా నువ్వు ఒక క్యారెక్టర్ లో డ్రామా చేస్తూ ఉంటావ్. క్యారెక్టర్ లో లీనమైపోయి ఉంటావు. నువ్వు నటిస్తున్నావు, నువ్వు ఫేక్.
నువ్వు నన్ను అబ్జర్వ్ చేయడానికి హౌస్ లోకి రాలేదు నీ గేమ్ నువ్వు ఆడడానికి వచ్చావు. అవును నేను ముసుకు దొంగని నా గేమ్ స్ట్రాటజీ ఇంతే అని ఆర్గ్యుమెంట్ లో అరిచింది తనుజ. నీ ఏజ్ కి తగ్గట్లు బిహేవ్ చేయడం నేర్చుకో అంటూ తనుజ రివర్స్ లో విరుచుకుపడింది.
నీకు ఏజ్ పెరిగింది గాని బుర్ర పెరగలేదు అంటూ తిరిగి రెచ్చిపోయింది రమ్య. వీరిద్దరికి మధ్య విపరీతమైన ఆర్గ్యుమెంట్ జరిగింది. కేవలం జుత్తును పట్టుకొని కొట్టుకోవటం మినహా అన్ని మాటలు అనేసుకున్నారు.
Also Read: Thanuja: కన్నింగ్ కు కేర్ అఫ్ అడ్రస్, మరి ఇంతలా నటించాలా?