Ganesh Laddu: హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా, భక్తిభావంతో జరుగుతున్నాయి. మాదాపూర్‌లోని ప్రతిష్ఠాత్మకమైన మై హోమ్ భుజా గేటెడ్ కమ్యూనిటీలో గణేశుని పూజలు, విగ్రహ స్థాపన, నిమజ్జనం వరకు ప్రతి కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయం కొనసాగుతూ వచ్చాయి. గణేశ్ లడ్డూ వేలం రికార్డు స్థాయిలో జరిగింది. ఏకంగా అర కోటి పైగానే పలకడంతో సోషల్ మీడియాలో లడ్డూ వేలంపాట గురించి తెగ వైరల్ అవుతోంది.
ఈ ఏడాది మాదాపూర్ మై హోమ్ భుజాలో లడ్డు వేలం పాట రికార్డు ధర పలికింది. చాలా సేపటి వరకు లడ్డూ వేలం పాట హోరా హోరీగా కొనసాగింది. చివరకు ఈ వేలం పాటలో రూ. 51,07,777లకు గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత అయిన ఇల్లందు గణేష్ అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు. గత ఏడాది ఇక్కడ లడ్డు వేలం పాట రూ. 29 లక్షలకు పాడిన విషయం తెలిసిందే.
ALSO READ: CM Revanth Reddy: యూరియా కొరతపై అసలు నిజాలు చెప్పేసిన సీఎం రేవంత్.. రాష్ట్రంలో జరిగేదంతా ఇదే..
పోయిన సంవత్సరం కూడా లడ్డూను గణేషే సొంతం చేసుకున్నారు. అయితే ఈ ఏడాది కూడా ఆయనే లడ్డూను దక్కించుకోవడం విశేషం. గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ ఛైర్మన్, ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామ వాసి గణేష్, సరిత దంపతులు ఈ లడ్డూను వేలంపాటలో పాడారు. ఇదిలా ఉంటే పోయిన సారి బాలాపూర్ లడ్డూ ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు వేలం పాట పాడగా ఇప్పుడు మై హోమ్ భుజా లడ్డూ వేలంలో దానిని దాటేసి రికార్డుల్లోకి ఎక్కింది.
ALSO READ: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్
మై హోమ్ భూజా అపార్ట్‌మెంట్ సముదాయం హైటెక్ సిటీలో ఉండటంతో.. ఇక్కడి నివాసితులు టెక్ ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు ఎక్కువగా ఉంటారు. ప్రతి సంవత్సరం గణేశుని విగ్రహాన్ని అందంగా అలంకరించి, పూజలు చేసి, చివర్లో ఆయనకు సమర్పించిన లడ్డూను వేలం వేస్తారు. ఈ ధనం సాధారణంగా దాతృత్వ కార్యక్రమాలకు, పేదల సహాయానికి వినియోగిస్తారు. ఈసారి వేలం ప్రారంభమైనప్పటి నుంచి ఉత్కంఠ రేపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో లడ్డూ వేలం పాట తెగ వైరల్ అవుతోంది.