BigTV English

Siddu Jonnalagadda: పది సంవత్సరాల తర్వాత మేమే తోపులం, నవీన్ పోలిశెట్టి, శేష్ లపై సిద్దు ఆసక్తికర కామెంట్

Siddu Jonnalagadda: పది సంవత్సరాల తర్వాత మేమే తోపులం, నవీన్ పోలిశెట్టి, శేష్ లపై సిద్దు ఆసక్తికర కామెంట్
Advertisement

Siddu Jonnalagadda: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది యంగ్ హీరోస్ కి మల్టీ టాలెంటెడ్ స్కిల్స్ ఉన్నాయి. అవి ఉండటం వలనే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకోగలిగారు. ఒకప్పుడు కొంతమంది నటులుగా పరిచయమైనప్పుడు వాళ్లలో పెద్దగా రైటింగ్ స్కిల్స్ ఉండేవి కావు. అందువల్లనే ప్రత్యేకంగా దర్శకులు వాళ్లకోసం పాత్రలు రాస్తే అవి పోషించేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలామంది యంగ్ హీరోలకు దర్శకుడు ఒక పాత్రను రాస్తే దాని గురించి జడ్జి చేసే నాలెడ్జ్ కూడా ఉంది.


అడవి శేష్, నవీన్ పోలిశెట్టి, సిద్దు జొన్నలగడ్డ వంటి హీరోలు కేవలం నటులుగా మాత్రమే కాకుండా రచయితలుగా కూడా మంచి పేరును సంపాదించుకున్నారు. అందుకే వాళ్ల సినిమాల్లో ఇన్వాల్వ్ అవుతూ రాసుకోవడం మొదలు పెడుతుంటారు. అలా రాసుకోవడం వల్లనే వాళ్లకి మంచి సక్సెస్ వచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

పది సంవత్సరాలు తర్వాత తోపులం 

నేను నటుడుగా కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు రైటింగ్ విషయంలో నాకు ఏమైనా అనిపించి చెబుతుంటే నువ్వు హీరోవి రైటింగ్ తో నీకేంటి సంబంధం అని అనేవాళ్ళు. కొన్ని రోజులు తర్వాత నాకు అనిపించింది అసలు ఈ రూల్స్ అన్ని ఎవరు పెట్టారు. మనం ఇన్వాల్వ్ అవ్వడంలో తప్పు ఏముంది అని ఫీలయ్యేవాన్ని, అని సిద్దు జొన్నలగడ్డ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.


ఇప్పుడు మేము కథలో ఇన్వాల్వ్ అవుతున్నాము అని చెప్పినా కూడా 10 సంవత్సరాలు పోయిన తర్వాత నేను, నవీన్ పోలిశెట్టి, అడవి శేష్ మా అందరి గురించి చాలా మంచిగా మాట్లాడుకుంటూ ఒక స్పెషల్ ఏవి కూడా క్రియేట్ చేస్తారు. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెట్టి మేము ముగ్గురం రియల్ ఓజిస్ అని ఇంస్టాగ్రామ్స్ లో రీల్స్ కూడా క్రియేట్ చేస్తారు. అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు సిద్దు.

నాకు ఆ బాధ్యత ఉంది 

ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నాను అంటే నాకు సినిమా మీద ఆ మాత్రం బాధ్యత ఉంది కాబట్టి. ప్రస్తుతానికి మా ప్రొడ్యూసర్ ఇక్కడ లేరు నేను ఈ సినిమాని ప్రమోట్ చేయాల్సి ఉంది.

సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసింది కాబట్టి నేను రిలాక్స్ అయిపోవచ్చు. కానీ నేను అలా చెయ్యలేదు. సినిమాను ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత నాకు ఉంది అంటూ సిద్దు ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేశాడు.

Also Read: NTR: ఊసరవెల్లి లాంటి సినిమా తీద్దాం, ఇదెక్కడి డెసిషన్ తారక్?

Related News

NTR: ఊసరవెల్లి లాంటి సినిమా తీద్దాం, ఇదెక్కడి డెసిషన్ తారక్?

Govardhan Asrani: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత!

Sreeleela: ఉస్తాద్ భగత్ సింగ్ పై అప్డేట్ ఇచ్చిన శ్రీలీల..పవర్ ప్యాకెడ్ అంటూ!

Ajmal Ameer: సె** ఆడియో చాట్ పై స్పందించిన నటుడు.. నన్నేం చేయలేవంటూ కామెంట్స్!

Chiranjeevi: మెగా ఇంట దీపావళి.. ఒకే ఫ్రేమ్ లో స్టార్ హీరోస్..ఫోటోలు వైరల్!

Ayan Mukerji: వార్ 2 ఎఫెక్ట్ ధూమ్ 4 నుంచి డైరెక్టర్ ఔట్…ఆశలు మొత్తం ఆ సినిమాపైనే?

Mari Selvaraj: నేను నీకు మద్యం ఇవ్వడం లేదు, నా సినిమా అలా చూడకు

Big Stories

×