Eesha Rebba: అచ్చ తెలుగు హీరోయిన్స్ లో ఈషా రెబ్బ ఒకరు. ఆంధ్రప్రదేశ్ లోని వరంగల్ లో పుట్టి పెరిగిన ఈ చిన్నది ప్రస్తుతం హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది.
అంతకుముందు ఆ తరువాత సినిమాతో ఈషా తెలుగులో తన కెరీర్ ను ప్రారంభించింది.
మొదటి సినిమాతోనే ఈషా తన నటనతో మంచి మార్కులే కొట్టేసినా అవకాశాలను మాత్రం అంతగా అందుకోలేకపోయింది అనే చెప్పాలి.
ఇక దీంతో ఈషా.. సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా సెకండ్ హీరోయిన్ గా, కీలక పాత్రల్లో నటించడం మొదలుపెట్టింది.
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన అ! సినిమాలో నిత్యామీనన్ ను ప్రేమించే లెస్బియన్ గా ఈషా క్యారెక్టర్ కు మంచి మార్కులు పడ్డాయి.
ఇక అరవింద సమేత, రాగల 24 గంటల్లో, సవ్యసాచి లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించి మెప్పించిన ఈషాకు గతేడాది దయ వెబ్ సిరీస్ మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది.
ఇక సినిమాలన్ని ఒక ఎత్తు అయితే.. అమ్మడికి సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
తాజాగా ఈషా.. మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. శారీ క్లాత్ లాంటి బికినీలో అమ్మడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. చెక్క ఉయ్యాల మీద అలా వెనక్కి వంగి జుట్టు సవరించుకుంటూ ఉంటే.. ఆ నడుము మడతలు కుర్రకారును గిలిగింతలు పెడుతున్నాయి.
ప్రస్తుతం ఈషా రెబ్బ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. ఎలారా ఇంత అందాన్ని పక్కన పెట్టేశారు అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ముందు ముందు ఈషా స్టార్ హీరోయిన్ గా మారే అవకాశాలు ఉన్నాయో లేవో అన్నది కాలమే నిర్ణయించాలి.