Police Stopped CM Atishi from meeting sonam wangchuk : ఢిల్లీ సీఎం అతిశీకి చేదు అనుభవం ఎదురైంది. ప్రముఖ వ్యక్తిని కలిసేందుకు ఆమె స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అనంతరం అక్కడే ఉన్న అతడిని పరామర్శించేందుకు ప్రయత్నించారు. కానీ, ఇందుకు పోలీసులు నిరాకరించారు. ఈ విషయాన్ని ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అదేంటి ఆమె ఒక ముఖ్యమంత్రి.. అలాంటిది ఆమెను పోలీసులు అడ్డుకోవడమేంటి? అంటూ ఆరా తీస్తున్నారు.
Also Read:రైలు ప్రయాణికులారా బిగ్ అలర్ట్.. రూల్స్ మారాయ్.. తెలుసుకోకుంటే చిక్కులే
ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మద్దతుదారులను కూడా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, పోలీసుల అదుపులో ఉన్న సోనమ్ వాంగ్ చుక్ ను కలిసేందుకు ఢిల్లీ సీఎం అతిశీ వెళ్లారు. కానీ, పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అయితే, వాంగ్ చుక్, అతని మద్దతురాలు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ గత నెల పాదయాత్ర చేస్తున్నారు. లేహ్ లో ప్రారంభించారు. ఐదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తమ ప్రాంతానికి సంబంధించి ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ఈ పాదయాత్ర చేస్తున్నామంటూ ఆయన హిమాచల్ ప్రదేశ్ లో వెల్లడించారు. అదేవిధంగా లద్దాఖ్ ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ లో చేర్చాలనేది వీరి ప్రధాన డిమాండ్. దీంతో వారి స్థానిక జనాభా, భూమి, సాంస్కృతిక గుర్తింపును రక్షించే విషయమై ఓ చట్టాన్ని రూపొందించేందుకు అధికారంల లభించనున్నది. ఇలా పలు డిమాండ్లతో వారు చేస్తున్న పాదయాత్ర లద్దాఖ్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. ఈ క్రమంలో పోలీసులు వారి పాదయాత్రను అడ్డుకున్నారు. సింగు సరిహద్దులో ఢిల్లీ పోలీసులు వాంగ్ చుక్ తోపాటు మొత్తం 120 మంది మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం నితిశీ వాంగ్ చుక్ ను కలిసేందుకు బవానా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కానీ, అతడిని కలవకుండా సీఎంను పోలీసులు అడ్డుకున్నారు.
Also Read:హర్యానాలో హస్తం మెరుస్తుందా..? కమలం వికసిస్తుందా?
ఈ విషయం తెలిసి ఆప్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ, రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుతున్న వాంగ్ చుక్ ను అదుపులోకి తీసుకోవడం సరికాదంటూ వారు పేర్కొంటున్నారు. శాంతియుతంగా పోరాడుతున్న వారిని పోలీసులు నిర్బంధించడం ఆమోదయోగ్యం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు తమ తీరును మార్చుకోవాలంటూ సలహా ఇస్తున్నారు.