BigTV English

Jubilee Hills By Poll: 40 మంది ప్రచార రథ సారథులు.. జూబ్లీహిల్స్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తారా..!

Jubilee Hills By Poll: 40 మంది ప్రచార రథ సారథులు.. జూబ్లీహిల్స్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తారా..!
Advertisement

Jubilee Hills By Poll: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కేంద్ర మంత్రుల ప్రచారం ఫలితాన్ని ఇస్తుందా..? ఒకరుకాదు ఇాద్దరు కాదు ఏకంగా 40 మంది ప్రచార రథ సారథుల్ని నియమించింది కాషాయపార్టీ.. కేంద్ర మంత్రుల సారథ్యంలో వారు జూబ్లీహిల్స్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తారా.? సమష్టి కృషితో ఈ సారైనా లంకల దీపక్ రెడ్డిని గెలిపించుకుంటారా? లేకపోతే సార్వత్రిక ఎన్నికల్లో లానే చతికిల పడతారా?


ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ మంత్రులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కమలం పార్టీ ప్రచార హోరుకు సిద్ధం అవుతుంది. బూత్ స్థాయి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది. కాస్త ఆలస్యమైన కమలం పార్టీ మళ్ళీ లంకల దీపక్ రెడ్డికే అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. ప్రచారంలో స్పీడ్ పెంచేందుకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ప్రచారంలో దూకుడుగా వెళ్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ముకుతాడు వేసేందుకు క్యాడర్ ను తట్టి లేపుతోంది. కాంగ్రెస్ తరుపున మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్‌లు జూబ్లీహిల్స్ ఇంచార్జ్ లుగా దూకుడుగా ప్రచారం సాగిస్తున్నారు.

కేంద్ర మంత్రుల ప్రచారంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ
ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను మానిటరింగ్ చేస్తూ సమస్యలను పరిష్కరిస్తూ, కోఆర్డినేషన్ తో ముందుకు అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ సైతం మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు లు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని జూబ్లీహిల్స్ పరిధిలో విస్తృతంగా తిరుగుతున్నారు. కేసీఆర్ సైతం ప్రచారానికి వస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ కమలం పార్టీ మాత్రం కేంద్ర మంత్రుల ప్రచారంపైనే గంపడాశాలు పెట్టుకుంది. కేంద్రమంత్రులతో పాటు రాష్ట్ర ముఖ్య నేతలు కలిసి ప్రచారాన్ని బూత్ లెవల్లో, ప్రతి ఇంటినీ టచ్ చేసేలా విస్తృతంగా చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.


దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ విజయం
గత ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజురాబాద్, మునుగోడుల్లో కాషాయ జెండా ఎగరవేసినట్టే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని పరివారులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఉపఎన్నికలో ఎలాంటి సెంటిమెంట్ కలిసిరాదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ ల పాలనలతో విసిగిపోయిన జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీకే పట్టం కడతారని బీజేపీ అంచనా వేస్తోంది. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి పాజిటివ్ ఫలితాలు సాధించుకునేందుకు ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ రాష్ట్ర నాయకత్వం విడుదల చేసింది.

ప్రచారం సారథుల లిస్టులో 40 మందికి స్థానం
ఈ స్టార్ కంపెయినర్ల లిస్ట్ లో 40 మందికి చోటు కల్పించింది. వారిలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, శ్రీనివాస్ వర్మ ఉన్నారు. వారితో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ను సైతం ప్రచార రథసారథులుగా నియమించింది. ఇక తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుతో పాటు 8 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, లకు చోటు కల్పించారు. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ జాబితాలో చోటు కల్పించారు.

Also Read: సీనియర్లకు వారసుల బెంగ.. ఆ నాయకులు ఎవరంటే..

ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటి భవిష్యత్తు ఎన్నికలకు లైన్ క్లియర్ చేసుకోవాలనే ఆలోచనలో రాష్ట్ర బీజేపీ ఉంది. ఈ ఉప ఎన్నిక నెగ్గి, భవిష్యత్తు తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీననే సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది. అయితే ఇప్పటికే జిల్లాల పంచాయితీ, నేతల మధ్య విభేదాలు, అధ్యక్షుడు రామచంద్రరావు ముందే ఫైటింగ్ లకు దిగుతున్న సందర్భాలతో పాటు సంస్థాగతంగా బీజేపీ సవాలక్ష సవాళ్లు ఎదుర్కొంటోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ క్యాంపెయినర్ల ఊరేగింపులతో కాషాయ సేనఅనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందో? లేదో? చూడాలి.

Story By Apparao, Bigtv

Related News

Sisters Politics: చెల్లెళ్ల వారసత్వ రాజకీయం.. కుటుంబ సభ్యుల మధ్య పోటీ..

AP Politics: సీనియర్లకు వారసుల బెంగ.. ఆ నాయకులు ఎవరంటే..!

Jubilee Bypoll: జూబ్లీహిల్స్‌లో త్రిముఖ పోరుపై ఉత్కంఠ..! గెలిచేదెవరు..?

Bihar Elections: వ్యూహకర్త వ్యూహం వర్కవుట్ అవుతుందా?

Nellore Janasena: నెల్లూరులో గ్లాసు పగులుతుందా? అజయ్ కుమార్ తీరుపై జన సైనికుల మండిపాటు

Kavitha New party: కవిత సోలో అజెండా.. ప్రజల్లోకి వెళ్లడానికి 4 నెలల షెడ్యూల్

Karnataka RSS: ఆరెస్సెస్ చుట్టూ కర్ణాటక రాజకీయాలు.. సంఘ్ బ్యాన్ ఖాయమా.. ?

Big Stories

×