BigTV English

Bigg Boss 9: దీపావళి స్పెషల్.. కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్!

Bigg Boss 9: దీపావళి స్పెషల్.. కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్!
Advertisement

Bigg Boss 9: బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ సరికొత్త వినోదాన్ని పంచుతూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss) .. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతున్న ఈ షో ఇప్పుడు తెలుగులో 9వ సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈరోజుతో ఆరువారాలు పూర్తి కాబోతున్నాయి. ఇదిలా ఉండగా దీపావళి సందర్భంగా హౌస్ లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయని చెప్పవచ్చు.


మిన్నంటిన దీపావళి సంబరాలు..

రంగురంగుల దుస్తులు.. అంతకుమించిన ఆటలు పాటలతో హౌస్ మొత్తం సంతోషంగా సాగింది. కంటెస్టెంట్స్ చేత నాగార్జున పెట్టిన టాస్కులు అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్ లందరికీ కూడా బిగ్ బాస్ తరపున స్పెషల్ సర్ప్రైజ్ లభించి అందరూ మరింత సంతోషం వ్యక్తం చేశారు. కంటెస్టెంట్స్ అందరికీ కూడా కొత్త బట్టలు అందించి, వారి కళ్ళల్లో ఆనందాన్ని చూశారు. రుచికరమైన వంటకాలతో అసలైన పండుగను తీసుకొచ్చారు బిగ్ బాస్.

కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్..

ఇకపోతే ఎపిసోడ్ మొత్తం సంతోషంగా సాగినా.. చివర్లో కంటెస్టెంట్స్ చేత కన్నీళ్లు పెట్టించారు హోస్ట్ నాగార్జున. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. తాజాగా వీకెండ్ లో భాగంగా దీపావళి స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా 42వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో ఒక టాస్క్ నిర్వహించారు హోస్ట్ నాగార్జున. తాను మూడు పదాలు చెబుతానని.. ఆ మూడు పదాలను గెస్ చేసి సినిమా పేరు ఏంటో చెప్పాలని టాస్క్ నిర్వహించారు. అంతేకాదు అందులో గెలిచిన లక్కీ పర్సన్స్ కి కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన వీడియో మెసేజ్ చూపిస్తామని కూడా తెలిపారు.


ఏడిపించేసిన సంజన..

అలా మొదట డెమోన్ పవన్ లక్కీ విన్నర్ కాగా.. ఆయనకు తన తల్లి పంపిన వీడియో మెసేజ్ ను చూపించారు. ఆ తర్వాత సుమన్ శెట్టి భార్య వీడియో మెసేజ్ ను కూడా చూపించారు. ఇక చివర్లో సంజన ఎమోషనల్ వీడియో అందరికీ కంటతడి పెట్టించింది. ఏడాది కూడా నిండని చిన్నారిని వదిలిపెట్టి హౌస్ లోకి వచ్చింది సంజన. ఇక తన భర్త కొడుకు, కూతురుని పక్కన పెట్టుకొని నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. నువ్వు సక్సెస్ అవుతావు. మా సపోర్ట్ నీకు ఎప్పటికీ ఉంటుంది అంటూ ఆమెను ఏడిపించేశారు ముఖ్యంగా కూతురిని చూసి కన్నీటి పర్యంతం అయిపోయింది సంజన. ఏది ఏమైనా ఈ దీపావళి సెలబ్రేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. చివర్లో సంజనకు సంబంధించిన వీడియో అందరికీ కన్నీళ్లు పెట్టించింది అనడంలో సందేహం లేదు.

ఈవారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్..

ఈవారం ఎలిమినేషన్స్ విషయానికి వస్తే.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు సొంతం చేసుకున్న భరణి శంకర్ ఎలిమినేట్ కాబోతున్నారు. వాస్తవానికి కంటెస్టెంట్స్ మధ్య కాస్త పార్షియాలిటీ చూపించారనే కోపంతోనే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చేసిన కామెంట్స్ తో ఈయనపై నెగెటివిటీ పెరిగిపోయింది. తద్వారా ఎలిమినేట్ అవుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: Bandla Ganesh: నెక్స్ట్ అల్లు అర్జున్ అతడే.. ఈ మాత్రం హైప్ ఇస్తే చాలు..చెలరేగిపోవడమే!

Related News

Bigg Boss Srija: తేరుకోలేకపోతున్న శ్రీజ.. జాబ్ కూడా వదిలేసా అంటూ ఎమోషనల్!

Bigg Boss: హౌస్ లో కుల వివక్షత.. ఇదెక్కడి గోలరా బాబు!

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ నుంచి భరణి అవుట్.. 6 వారాలకు ఎంత సంపాదించాడంటే?

Bigg Boss 9: మాధురి కోరిందే జరిగింది.. ఫుడ్ మానిటర్ ఛేంజ్, తనూజ కళ్లు తెరిపించిన నాగ్

Emmanuel : గోల్డెన్ స్టార్ రాగానే పోగరు పెరిగిందా.. నీకు పగిలిపోద్ది.. ఇమ్మూకి నాగ్ వార్నింగ్

Ritu Chaudhary : ప్లేట్ మార్చేసిన రీతు, కేవలం గేమ్ కోసమే. ఫీలింగ్స్ లేవా?

Ramya Moksha : కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడా.. ఆడియన్స్ కూడా అదే తేల్చేశారుగా

Big Stories

×