Samosa Vendor Video: ఇటీవల రైలు ప్రయాణాల్లో ప్రయాణికులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. క్యాటరింగ్ సిబ్బంది చర్యలకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో యూపీఐ చెల్లింపు విఫలమైనందుకు ఒక సమోసా వ్యాపారి ప్రయాణికుడిని వేధించాడు. కదులుతున్న రైలు ఎక్కుతున్న అతన్ని ఆపి, చొక్కా పట్టుకుని బలవంతంగా డబ్బు డిమాండ్ చేశాడు. యాప్ పనిచేయడంలేదని సమోసాలు వద్దని చెప్పినా వ్యాపారి వినలేదు. చేసేదేం లేక ప్రయాణికుడు తన స్మార్ట్‌వాచ్‌ను తాకట్టు పెట్టి సమోసాలు తీసుకొని రైలు ఎక్కాడు. ఈ ఘటనను అక్కడున్న ప్రయాణికులు వీడియో తీశారు.
ఈ వీడియోను రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ కు ట్యాగ్ చేస్తూ దయచేసి ప్రయాణికుల భద్రతను క్యాటరింగ్ మాఫియా నుంచి కాపాడాలని కోరుతున్నారు. ఈ సంఘటన అక్టోబర్ 17వ తేదీ సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో జబల్పూర్ రైల్వే స్టేషన్‌లోని 5వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై జరిగినట్లు వీడియోలో తెలుస్తోంది.
సమోసాలు కొనడానికి ప్రయాణికుడు రైలు నుంచి కిందకు దిగాడు. అయితే, అతని రైలు ప్లాట్‌ఫామ్ నుంచి బయలుదేరడం చూసి సమోసాలు తీసుకోకుండా రైలు ఎక్కబోయాడు. వ్యాపారి పట్టుబట్టడంతో తన మొబైల్ యాప్ ద్వారా చెల్లింపు చేయడానికి ప్రయత్నించాడు. అయితే, యూపీఐ యాప్ పనిచేయలేదు. ప్రయాణికుడు సమోసాలను వదిలి రైలును ఎక్కడానికి ప్రయత్నించాడు. అయితే, సమోసా వ్యాపారి అతడి కాలర్ పట్టుకుని డబ్బు చెల్లించి సమోసాలను తీసుకోమని బలవంతం చేశాడు.
Catering Mafia of Indian Railways did it again.
A passenger went to buy Samosa at Jabalpur Railway Station. But his UPi not worked and suddenly the train started moving so he left without buying the Samosa. But the Vendor grabbed his collar and accused him of wasting his time.… pic.twitter.com/fJM5Ybstk9— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) October 18, 2025
ఆ ప్రయాణికుడు సమోసాలు వద్దని, తన ట్రైన్ వెళ్లిపోతుందని చెప్పినా వ్యాపారి పట్టించుకోలేదు. ప్రయాణికుడి కాలర్, చొక్కా గట్టిగా పట్టుకున్నాడు. నీ వల్ల నా సమయం వృధా అయిందని ఆరోపిస్తూ, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన వద్ద డబ్బులు లేవని చెప్పగా చేతి వాచ్ ఇచ్చి సమోసాలు తీసుకెళ్లాలని విక్రేత బలవంతం చేశాడు. దీంతో ప్రయాణికుడు హడావుడిగా తన వాచ్ ఇచ్చి సమోసాలు తీసుకుని ట్రైన్ ఎక్కాడు. వ్యాపారి దుశ్చర్య వీడియోలో రికార్డు అయింది. వ్యాపారి తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Viral Video: అండర్ వేర్ ను బ్యాగ్ గా మార్చేసి షాపింగ్.. ఆ మహిళ చేసిన పనికి అంతా షాక్!
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రైల్వేలో క్యాటరింగ్ మాఫియా రోజు రోజుకూ రెచ్చిపోతుందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో, ఆ వ్యాపారిని ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు జబల్పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ తెలిపారు.