Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తన భర్త అనిల్‌తో కలిసి నేడు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.. తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలైన ఆమె, ఈ దర్శనాన్ని తన సంస్థ రాష్ట్రవ్యాప్త ‘జనంబాట యాత్ర’ కార్యక్రమానికి దైవిక ఆశీస్సుల కోసం చేసుకున్నారు. ఈ యాత్ర అక్టోబర్ 25 నుంచి ప్రారంభమై, నలు మార్గాల కొనసాగి, ఫిబ్రవరి 13, 2026 వరకు జరగనున్నది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రాలు సుభిక్షంగా, క్షేమంగా ఉండాలని ఆమె శ్రీవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.
కవిత గారు తన భర్త అనిల్, జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచార్యలతో కలిసి శనివారం రాత్రి శంషాబాద్ నుంచి తిరుపతికి బయల్దేరారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత, “తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. హతీరాం బావాజీ బార్సీ ఉత్సవాల్లో పాల్గొని మరోసారి దర్శనం చేసుకుంటాము. ఈనెల 25 నుంచి తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమాన్ని సంకల్పించాను. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, ప్రజలతో మమేకం కావడానికి స్వామివారి ఆశీస్సులు కోరుకుని ఇక్కడికి వచ్చాను” అని తెలిపారు.
దర్శనం తర్వాత, తిరుమలలోని హతీరాం బావాజీ మఠాన్ని సందర్శించారు. అక్కడ భోగ్ భండారాల్లో పాల్గొని, భగవంనామ స్మరణ చేశారు. బంజారా సోదరులతో సత్సంగం నిర్వహించి, వారికి ఆశీస్సులు అందించారు. ఈ మఠం ఆంధ్ర-తెలంగాణ బంజారా పీఠాధిపతులకు ప్రత్యేకమైనది. ముఖ్యంగా, ఈ ఉత్సవాల్లో తెలుగు రాష్ట్రాల పీఠాధిపతులకు మాత్రమే పూజలు చేసేలా టీటీడీ చైర్మన్‌కు ఆమె ఇటీవల ఒత్తిడి తెచ్చిన సందర్భం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుచేసుకోవాలి. ఈ దర్శనం జాగృతి యాత్రకు ఆధ్యాత్మిక శక్తిని ప్రదానం చేసినట్లు కవిత స్పష్టం చేశారు.
Also Read: ఎమ్మెల్యేకే బురిడీ..! రూ.1.07 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
‘జాగృతి జనంబాట యాత్ర’అనేది ఈ సంస్థ రాష్ట్రవ్యాప్త ప్రజా సంప్రదింపు కార్యక్రమం. అక్టోబర్ 25 నుంచి ప్రారంభమై, 4 నెలల పాటు కొనసాగనున్నది. ఈ యాత్రలో కవిత ప్రతి జిల్లాలో రెండు రోజులు ఉండి, ప్రజలతో నేరుగా సంప్రదించి, వారి సమస్యలు తెలుసుకుంటారు. ప్రభుత్వ హామీల అమలు, సామాజిక న్యాయం, మహిళల-యువత అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ రక్షణ వంటి అంశాలపై దృష్టి పెడతారు. యాత్ర పోస్టర్‌ను అక్టోబర్ 16న బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో కవిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ‘సామాజిక తెలంగాణ’ భావనను బలోపేతం చేస్తూ, ప్రజల్లోకి వెళ్లి ఐక్యత పెంచుతుందన్నారు.
భర్త అనిల్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత pic.twitter.com/o2RrEmlq4z
— BIG TV Breaking News (@bigtvtelugu) October 19, 2025