Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంచిర్యాలలోని రెడ్డికాలనీకి చెందిన సింగరేణి రిటైడ్ కార్మికుడు పాత విఘ్నేశ్, రమాదేవి దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, అమెరికాలో స్థిర పడ్డారు. చిన్న కుమార్తె తేజస్వి గృహ ప్రవేశం కోసం విఘ్నేశ్ దంపతులు అమెరికా వెళ్లారు. గృహ ప్రవేశం ముగిసిన తర్వాత.. పెద్ద కూతురు శ్రవంతి కొడుకు నిశాంత్ బర్త్‌డే కోసం మరో ప్రాంతానికి వెళ్తుండగా.. అటుగా వస్తున్న ఓ టిప్పర్ తేజస్వి కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో తేజస్వి(32), రమాదేవి(52) అక్కడికక్కడే మృతిచెందారు. అలాగే కారులో ఉన్న విఘ్నేశ్ అల్లుడు కిరణ్ ,పిల్లలు గాయపడ్డారు. దీంతో స్థానికులు వెంటనే సహాయ చర్యలు చేపట్టి హాస్పిటల్‌కి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.