Nara Lokesh Australia Visit: విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. సిడ్నీలో ఆయన ఆస్ట్రేలియా–ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ మెక్‌కే తో భేటీ అయ్యి, ఇరు దేశాల వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు.
ఈ సమావేశంలో మంత్రి లోకేష్, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. మంత్రి మాట్లాడుతూ.. ఏపీఈడీబీ, సీఐఐ, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహించే ఆస్ట్రేలియా-ఏపీ సీఈవో రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలోని కృష్ణపట్నం, విశాఖపట్నం, అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం వహించేలా సహకారం అందించాలని కోరారు. నవంబర్ 14,15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్టనర్ షిప్ సమ్మిట్ – 2025కు ఫోరం నాయకత్వ బృందంతో కలసి హాజరుకావాల్సిందిగా మంత్రి లోకేష్ ఆహ్వానించారు.
ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఇండస్ట్రియల్ క్లస్టర్‌లలో.. పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా కంపెనీలకు సహకరించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. ఆస్ట్రేలియా–ఇండియా స్టేట్ ఎంగేజ్‌మెంట్ ఎజెండాలో ఆంధ్రప్రదేశ్‌ను చేర్చాలని లోకేష్ కోరారు. ఆస్ట్రేలియాతో విద్య, ఐటీ, నూతన సాంకేతిక రంగాల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేలా ప్రత్యేక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే ఉంది. ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, గ్రీన్ టెక్నాలజీల్లో ఆస్ట్రేలియా నైపుణ్యం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఆయన అన్నారు.
పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లోని కార్యక్రమంలో.. తెలుగువారితో కూడా సమావేశమయ్యారు. అక్కడ వారు రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. ప్రవాస తెలుగువారి అనుభవం, నెట్‌వర్క్ రాష్ట్రానికి మేలును చేకూరుస్తుంది. మీరు రాష్ట్రానికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలి అని మంత్రి తెలిపారు. సాంకేతిక రంగంలో పనిచేస్తున్న ప్రవాసులు ఆంధ్రప్రదేశ్‌లో స్టార్టప్‌లు స్థాపించాలని కోరారు.
Also Read: పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమ ఒప్పందం
సీఈవో ఫోరం డైరెక్టర్ మెక్‌కే మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నందుకు ప్రశంసలు తెలిపారు. ఐటీ, విద్యా రంగాల్లో ఆస్ట్రేలియా కంపెనీలు భాగస్వామ్యం చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి అని ఆయన పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాలో మంత్రి
నారా లోకేష్‌కు ఘన స్వాగతంఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు తెలుగుదేశం పార్టీ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ విజయ్, వైస్ ప్రెసిడెంట్ సతీష్ ఆధ్వర్యంలో తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు.
బ్రిస్బేన్,… pic.twitter.com/syoxf7Sheb— Telugu Desam Party (@JaiTDP) October 19, 2025
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ క్రికెట్ స్టేడియం లో తెలుగు వారితో సమావేశమైన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్. https://t.co/A8N95dZTuw
— Telugu Desam Party (@JaiTDP) October 19, 2025