BigTV English

Diwali 2025: లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే.. పండగ రోజు దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలి ?

Diwali 2025: లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే.. పండగ రోజు దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలి ?
Advertisement

Diwali 2025: దీపావళి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండగ. ఈ వేడుక ధన త్రయోదశితో మొదలై భాయ్ దూజ్‌తో ముగుస్తుంది. ఈ సమయంలో దీపాలు వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. మత విశ్వాసం ప్రకారం.. దీపావళి నాడు దీపాలు వెలిగిస్తే లక్ష్మీ దేవి సంతోషిస్తుంది. కానీ దీపావళి రోజు డు దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలి, వాటి ప్రాముఖ్యతను గురించిన తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.


దీపావళి పండగను కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రోజున లక్ష్మీదేవిని, గణపతిని పూజించడం ఆచారం. మత విశ్వాసం ప్రకారం.. లక్ష్మీదేవిని పూజిస్తే భక్తులు తమ జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా, ఆమె ఆశీర్వాదాలను పొందుతారు. ఈ రోజున దీపం వెలిగించడం కూడా చాలా పవిత్రంగా పరిగణిస్తారు. పండగ రోజు దీపాలు వెలిగిస్తే ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుందని, అంతే కాకుండా ప్రతికూల శక్తి నశించిపోతుందని నమ్ముతారు. ఇది ఆనందం, శ్రేయస్సును కూడా పెంచుతుందని చెబుతారు. దీపావళి నాడు దీపాలు వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి వచ్చే పవిత్ర ప్రదేశాలను జీవితంలో ఆనందం మరియు శాంతి నిలిచి ఉంటాయి.

తులసి దగ్గర దీపం:
దీపావళి రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే.. లక్ష్మీదేవి ప్రసన్నమై, జీవితంలో ఆనందం, శాంతి కలుగుతాయని నమ్ముతారు. అంతే కాకుండా డబ్బుకు కొరత ఉండదని చెబుతారు.


ఇంటి బయట దీపం:
ఇంటి ప్రాంగణంలో కూడా దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి.. జీవితంలో సంతోషం కలుగుతుంది.అంతే కాకుండా సానుకూల శక్తి కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుంది.

Also Read: దీపావళి రోజు ఈ ఒక్కటి చేస్తే.. ఏడాదంతా సంపదకు లోటుండదు !

చెడు దృష్టి తొలగిపోతుంది:
దీపావళి రోజు.. పూజ గదిలో లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాల ముందు దీపం వెలిగించండి. హారతి ఇచ్చిన తర్వాత మంత్రాలు జపించండి. ఆనందం, శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని ప్రార్థించండి. మత విశ్వాసం ప్రకారం.. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ ఆచారం మీ సమస్యలను పూర్తి చేస్తుంది. అపారమైన సంపదను తెస్తుంది. ఇది మీ జీవితంలోకి కొత్త వెలుగును కూడా తీసుకొస్తుంది.

ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది:
దీపావళి నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం చాలా ముఖ్యం. మత విశ్వాసం ప్రకారం.. ఈ ఆచారం సంపద, శ్రేయస్సును పెంచుతుంది. అంతే కాకుండా మీ ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది.

ఆహార కొరత ఉండదు:
దీపావళి రోజు వంటగదిలో దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణిస్తారు. అలా చేయడం వల్ల అన్నపూర్ణ దేవి ఆశీస్సులు లభిస్తాయి.

Related News

Diwali Vastu Tips: దీపావళి రోజు ఈ వాస్తు టిప్స్ పాటిస్తే.. డబ్బే డబ్బు

Diwali 2025: దీపావళికి కొత్త వస్తువులు కొనొచ్చా ? ఈ రోజు పొరపాటున చేయకూడని పనులివే !

Diwali 2025 Upay: దీపావళి రోజు ఈ ఒక్కటి చేస్తే.. ఏడాదంతా సంపదకు లోటుండదు !

Dhanteras 2025: ధన త్రయోదశి నాడు ఈ సమయంలో బంగారం కొంటే.. కుబేరులవుతారు

Diwali 2025: దీపావళి రోజు.. లక్ష్మీ దేవిని పూజించే సరైన పద్ధతి ఏంటో తెలుసా ?

Diwali 2025: దీపావళి రోజు ఇంటికి ఇవి కొని తెస్తే .. అష్టైశ్వర్యాలు కలుగుతాయ్

Wakeup at Night: రాత్రి ఆ సమయంలో నిద్రలేస్తున్నారా.. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మీకు తెలుసా?

Big Stories

×