K-Ramp: కిరణ్ అబ్బవరం (Kiran abbavaram) .. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్నారు. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన.. తాజాగా నటించిన కామెడీ , రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ కే -ర్యాంప్ .. దీపావళి సందర్భంగా అక్టోబర్ 18వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉన్నాయని.. మీ కుటుంబంతో కలిసి ఇలాంటి సన్నివేశాలు మీరు చూడగలరా అంటూ మీడియా కూడా ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాకి కలెక్షన్లు వస్తాయా అని అందరూ అనుమానాలు వ్యక్తం చేయగా.. మంచి ఓపెనింగ్ కలెక్షన్లు ఈ సినిమా రాబట్టినట్లు తెలుస్తోంది.
కిరణ్ అబ్బవరం హీరోగా.. యుక్తి తరేజా హీరోయిన్గా జైన్స్ నాని దర్శకుడిగా తొలి పరిచయంలో వచ్చిన కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం కే ర్యాంప్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మొదటిరోజు మంచి కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.2.15 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసింది. మొత్తానికి అయితే మంచి ఓపెనింగ్ తోనే ప్రారంభమైన ఈ సినిమా మునుముందు ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.
ఇకపోతే మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లలో ఈ సినిమాకి ఆక్యుపెన్సీ ఎలా ఉంది అనే విషయానికొస్తే.. మొత్తం 37.10 శాతం ఆక్యుపెన్సీ నమోదయింది. ఉదయం షోలలో 26.01% నమోదు కాగా.. మధ్యాహ్నం 35.14%.. సాయంత్రం 35.98% అలాగే రాత్రి 51.27 శాతం ఆక్యుపెన్సీ తో సినిమా రన్ అయినట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు, తమిళ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా దక్కించుకుంది. థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాలు లేదా ఎనిమిది వారాలలోపు ఈ సినిమా స్ట్రీమింగ్ కి సిద్ధం కానుంది.
రాజావారు రాణిగారు అనే సినిమాతో 2019లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈయన.. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం, సెబాస్టియన్ పిఎస్ 524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్, క, దిల్ రూబా అంటూ పలు చిత్రాలలో నటించి మంచి ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ఈయనకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
కిరణ్ అబ్బవరం వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య ఘోరక్ తో 2024లో ఏడడుగులు వేయగా.. ఈ ఏడాది మేలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.
ALSO READ : Bigg Boss 9: దీపావళి స్పెషల్.. కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్!