Faria Abdullah Latest Photos: హీరోయిన్ అంటే హీరోకంటే హైట్ తక్కువ ఉండాలి అనుకునే రోజుల్లో ఒక హైదరాబాదీ అమ్మాయి వచ్చి అదేంటి ఇంత హైట్ ఉన్న అమ్మాయి హీరోయిన్ ఎలా అయ్యింది అని అందరినీ ఆశ్చర్యపరిచింది. తనే ఫరియా అబ్దుల్లా.

అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ మూవీతో సినీ పరిశ్రమలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది ఫరియా.

మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా కూడా, బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వచ్చినా కూడా ఫరియా వాటిని యాక్సెప్ట్ చేయలేదు.

‘జాతిరత్నాలు’ విడుదలయిన రెండేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయ్యింది ఫరియా అబ్దుల్లా.

తాజాగా శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన ‘మత్తు వదలరా 2’తో చాలాకాలం తర్వాత మోస్ట్ వాంటెడ్ హిట్ అందుకుంది.

‘మత్తు వదలరా’ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘మత్తు వదలరా 2’ కూడా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.

మినిమమ్ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘మత్తు వదలరా 2’ కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతుండడంతో సెలబ్రేషన్స్‌లో బిజీ అయిపోయింది ఫరియా.

హీరో శ్రీ సింహా కోడూరితో కలిసి సక్సెస్ టూర్ పేరుతో సిటీలు అన్నీ చక్కర్లు కొట్టేస్తోంది ఫరియా అబ్దుల్లా.

ఇటీవల సక్సెస్ సెలబ్రేషన్స్‌లో చీరకట్టులో కనిపించి యూత్‌కు మత్తు వదించిడం కాదు.. ఎక్కిస్తోంది అంటున్నారు ఫాలోవర్స్.
