Bigg Boss 9 Telugu : తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ రోజు రోజుకు ఆసక్తిగా మారుతుంది. కొన్ని వారాల్లో ఈ సీజన్ కు శుభం కార్డు పడబోతుంది. అయితే 9వ వారం కూడా అయిపోతున్న నేపథ్యంలో ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి.. బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు హౌస్ లోని కొందరు కంటెస్టెంట్లు నువ్వా నేనా అని పోటీపడి మరి ముందుకు వెళ్తున్నారు.. మరికొందరు మాత్రం ఎందుకు ఏంటో తెలియదు కానీ ఆటపై ఆసక్తి చూపించకుండా దీని కన్నా ఇంటికి వెళ్లడమే బెటర్ అన్న రీతిలో ఉన్నట్లు ఎపిసోడ్స్ ను చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే చాలామంది హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు. ఈవారం జరిగిన నామినేషన్స్ మాత్రం జనాలను ఉత్కంఠగా ఎదురుచూసేలా చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ న్యూసు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మొన్నటి వరకు స్ట్రాంగ్ గా ఉన్న కంటెస్టెంట్ ఇప్పుడు గేమ్ పై ఫోకస్ చేయడం లేదని, ఇంటికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త వినిపిస్తుంది. ఆ కంటెస్టెంట్ ఎవరు? ప్రస్తుతం ఆయన ఓటింగ్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం..
ప్రతి వారం లాగే ఈ వారం కూడా కెప్టెన్సీ టాస్క్ లలో హౌస్ మేట్స్ పెద్ద రచ్చే చేశారు.. ఈ టాస్క్ లో భాగంగా భరణి, రీతు, ఇమ్మాన్యుయెల్, తనూజ, రాము మధ్య చర్చ జరిగింది.. అయితే రాము సాక్రిఫైజ్ చేసి ఇమ్మాన్యుయెల్ కి కెప్టెన్సీ కంటెండర్ ఛాన్స్ ఇచ్చాడు. ఇదంతా చూస్తుంటే రాముకి హౌస్ లో ఇక కొనసాగాలన్న ఆలోచన లేనట్టు కనిపిస్తుంది. నిజానికి బయట రాముకు మంచి ఫాలోయింగ్ ఉంది. బాగా హౌస్ లో ఆడితే అతనికి ఓటింగ్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఎందుకు అతను అలా చెయ్యడం లేదు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇక ఇతని ఓటీంగ్ కూడా దారుణంగా ఉంది.. ప్రస్తుతం ఈయన డేంజర్ జోన్లో ఉన్నాడు. గౌరవ్, రామ్ లీస్ట్ లో ఉన్నారు. ఇదే విధంగా ఉంటే హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ఇమ్మాన్యుయెల్ మొదటి నుంచి మాస్టర్ మైండ్ తో ఆడుతున్నాడు. అదే అతన్ని సేఫ్ ప్లేసులో ఉంచుతుంది. ప్రతి టాస్క్ లో తన పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తూనే తన ఎంటర్టైన్మెంట్ తో అలరిస్తున్నాడు.. ఈ వారం గ్రీన్ కార్డు తీసుకున్న ఇమ్మూ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు.. 9 వారాల్లో ఇమ్మాన్యుయెల్ అసలు నామినేషన్స్ లోకి రాకుండా డైరెక్ట్ గా టాప్ 5లోకి వెళ్లాలని చూస్తున్నాడు.. ఈ వారం కెప్టెన్ కాబట్టి ఛాన్స్ లేదు. ఇదే స్పీడులో ఇమ్మూ కొనసాగితే ఫైనల్ వరకు చేరే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం నామినేషన్స్ లో ఉన్నది ఎవరంటే.. తనూజ, రాము, భరణి, సుమన్, సంజమ, శ్రీనివాస్ సాయి, కళ్యాణ్ ఉన్నారు.. గౌరవ్, రామ్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారో తెలియాలంటే వీకెండ్ ఎపిసోడ్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే..