Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత సోలో హీరోగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 న రిలీజ్ కానుంది.
స్టార్ డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్
ప్రమోషన్స్ లో భాగంగా నేడు యు.ఎస్‌లోని డల్లాస్‌లో గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ గా నిర్వహించారు.
అభిమానులతో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో రామ్ చరణ్, దిల్ రాజు, శిరీష్, చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి తదితరులు పాల్గొన్నారు.
ఇక ఈ ఈవెంట్ లో చరణ్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆన్ స్క్రీన్ అయినా.. ఆఫ్ స్క్రీన్ అయినా స్టైల్ తోనే పిచ్చెక్కిస్తాడు చరణ్.
ఇక ఈ ఈవెంట్ లో బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ పై చాక్లెట్ కలర్ జాకెట్ వేసుకొని .. బ్లాక్ గాగుల్స్ తో నడుస్తూ వస్తుంటే రియల్ గ్యాంగ్ స్టర్ లా కనిపించాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. బుచ్చిబాబు సినిమా కోసం ఈ లుక్ ను మెయింటైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక గేమ్ ఛేంజర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.