బ్లాక్ మ్యాన్ గురించి మిస్సమ్మ ఆలోచిస్తుంది. మిస్సమ్మ పర్సు తీసుకుని చూడగానే అందులో చనిపోయిన వాళ్ల అమ్మ ఫోటో ఉంటుంది. వెంటనే మిస్సమ్మ ఇది అమ్మ ఫోటో అంటే ఇది నాన్న పర్సు. అంటే ఆ బ్లాక్ మ్యాన్ నాన్ననా..? అని అనుమానంగా భయపడుతుంది. మరోవైపు ఇంటికి వెళ్లిన రామ్మూర్తి బ్లాక్ మ్యాన్ గెటప్ తీసేస్తుంటాడు. మరోవైపు రూంలోకి వెళ్లిన మనోహరిని చంభా గుర్తు చేసుకో మనోహరి నీ వల్ల బాగా ఎఫెక్ట్ అయింది ఎవరో గుర్తు చేసుకో అని చంభా చెప్తుంది. ఇక మిస్సమ్మతో అమర్ అనుమానంగా మనోహరి కోసం మన ఇంటికి ఎవరైనా వచ్చారా.? అని అడగ్గానే.. తను అనాథ కదండి ఎవ్వరూ రాలేదు అని మిస్సమ్మ చెప్తుంది.
ఇక రూంలో చంభా అమరేంద్ర కోసం నువ్వు ఈ ఇంటికి వస్తే నీ కోసం ఆ బ్లాక్ మ్యాన్ వస్తున్నాడు .. ఎక్కడ నీ జీవితం ఉందనుకుంటున్నావో అక్కడే నీ మృత్యువు కూడా ఉంది మనోహరి అని చెప్తుంది చంభా. దీంతో మనోహరి కోపంగా వాడు ఎవడో తెలిస్తే వాడికే నేను మృత్యుదేవతను అవుతాను వాడిని ఎలాగైనా కనిపెట్టాలి అని కోపంగా చెప్తుంది. ఇక తన ఇంట్లో ఉన్న రామ్మూర్తి ఆరు ఫోటోనూ చూస్తూ తిరిగి చూసి నువ్వు నన్ను కనిపెట్టలేవు మనోహరి. నీ పాలిట యముడిని నేనే.. అనుకుంటాడు. ఇంకోవైపు చంభా ఆ యముడిని కనిపెట్టడం నీ వల్ల అవుతుంది అనుకుంటున్నావా..? అని అడగ్గానే.. నా వల్ల కాకపోయినా అమర్ వల్ల అవుతుంది. ఆ బ్లాక్ మ్యాన్‌ను నేను వదిలిపెట్టినా.. అమర్ వదిలిపెట్టడు అని చెప్తుంది.
మరోవైపు రామ్మూర్తి నా కూతురి చావుకు కారణమైన నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. ఆరోజు నా కూతురును ఎలా వెన్నుపోటు పొడిచావో అదే విధంగా నేను అజ్ఞాతంలో ఉండి నిన్ను చంపేస్తాను. నా కూతురుకు ఆత్మ శాంతి చేకూరుస్తాను.. అని అనుకుంటాడు. ఇటువైపు చంభా నీ గురించి అమరేంద్రకు తెలిసిపోతే తనే నిన్ను చంపేస్తాడేమో..? అని ప్రశ్నించగానే.. అలా జరగదు అనవసరంగా నన్ను భయపెట్టకు.. అమరేంద్రకు నిజం తెలిసేలోపే భాగీ చస్తుంది. ఆ బ్లాక్ మ్యాన్ చస్తాడు అని మనోహరి చెప్తుంది. అటువైపు రామ్మూర్తి కూడా నిన్ను చంపకుండా నేను చావను మనోహరి.. అమ్మా అరుంధతి బతికి ఉండగా నీకు ఈ నాన్న ఏమీ చేయలేకపోయాడమ్మా..? నిన్ను చంపిన ఆ మనోహరిని నేను చంపి నీ ఆత్మకు శాంతి నేను చేకూరుస్తానమ్మా..? ఇదే ఈ తండ్రి నీకు ఇచ్చే నివాళి అంటాడు రామ్మూర్తి.
తర్వాత యముడు, గుప్త ఏదో మాట్లాడుకుంటుంటే.. ఇంతలో నారదుడు వస్తాడు. నారదుడిని చూసిన యముడు భయంతో వణికిపోతాడు. గుప్త ఈ నారదుడికి వేరే కార్యమే లేదా..? మన లోకము చుట్టూ విహరిస్తున్నారు..? అని అడగ్గానే.. ప్రభు ఆయనకు సందేహం వచ్చినచో ఒక పట్టాన వదలరని తమకు కూడా విదితమే కదా ప్రభూ అంటూ గుప్త చెప్పగానే.. అతని సందేహం వలన మా సింహాసనానికి ప్రమాదం వాటిల్లుఏమోనని మా దేహము వణుకుతున్నది అని యముడు చెప్పగానే.. ఆ చింతించకండి ప్రభు అటువంటి ప్రమాదం ఏమీయూ లేదు..? అని చెప్పగానే..
ఇంతకీ ఆ బాలిక దేవకన్య వేషధారణలోనే ఉన్నది కదా… అని అడగ్గానే.. అవునని గుప్త చెప్తుండగానే.. నారదుడు దగ్గరకు వచ్చి ఏమిటి యమధర్మరాజా..? ఏదో వేషధారణ అంటున్నారు అని అడగ్గానే.. ఈ రోజు తమరి వేషధారణ బహు బాగుగా ఉన్నది నారదమునీశ్వరా అని యముడు చెప్పగానే.. ఈరోజు ఏమిటి ప్రతి రోజూ ఇలాగే ఉంటాను కదా..? అంటూ నారదుడు అనగానే.. గుప్త అవును మునీంద్ర తమరు నిత్య యవ్వనులు అంటూ పొగడగానే.. నారదుడు మీరు ఇరువురు మమ్మల్ని పని గట్టుకుని పొగుడుతున్నారేంటి..? అని అడుగుతాడు. దీంతో యముడు మిమ్మల్ని పొగడటం తప్పా మాకు వేరే పని లేదు మరి అని మనసులో అనకుంటాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.