Gundeninda GudiGantalu Today episode November 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. సుశీల బర్త్డే వేడుకల కోసం ఇల్లంతా చాలా అందంగా ముస్తాబు చేస్తారు. అది చూసి నా సుశీల చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. నా పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే నాకు మంచి గిఫ్ట్ చేయీ నన్ను మెప్పిస్తారు వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది అని అంటుంది. దాంతో ప్రభావతి ఆ గిఫ్ట్ ఎలాగైనా సరే నేనే కొట్టేయాలని అనుకుంటుంది. ప్రభావతి అత్తయ్య ఎలాంటి గిఫ్ట్ ఇస్తుందో ఏదైనా నగలు ఇస్తుందేమో.. డబ్బులు ఇస్తుందేమో అని ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్యకి నేనే మంచి గిఫ్ట్ ఇచ్చి ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏదో కొట్టేయాలని అనుకుంటుంది. సత్యంని మీ అమ్మకి ఇష్టమైనది ఏంటో చెప్పండి అని అడిగినా సరే నాకు ఏమీ తెలియదని సైడ్ అయిపోతాడు. మొత్తానికి అందరూ మాత్రం ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ని తామే కొట్టేయాలని ప్లాన్లు మీద ప్లాన్ వేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ప్రోమో విషయానికి వస్తే.. బాలు బామ్మ పుట్టినరోజుకి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను కానీ అది జరగలేదు. నాకు ఇంట్లో ఉంటే కచ్చితంగా ఆ నగల విషయమే గుర్తొస్తూ ఉంటుంది అని బయటికి వెళ్లిపోతాడు. పుట్టినరోజు వేడుకలు జరిగే జరిగే టైం కి నేను మళ్లీ ఇంటికి వస్తానని అంటారు. సుశీల సత్యం ఒద్దురా అని చెప్పిన సరే నాకు కొన్ని గుర్తొస్తుంటాయి నేను వెళ్లాల్సిందేనని బాలు బయటికి వెళ్లిపోతాడు.
ప్రభావతి వాళ్ళ అత్తకి ఎలాగైనా మంచి గిఫ్ట్ ఇచ్చి అత్త దగ్గర నుంచి బహుమతి పొందాలని అనుకుంటుంది.. అయితే కామాక్షి కి ఫోన్ చేస్తుంది ప్రభావతి. మా అత్తయ్య గారు పుట్టినరోజు వేడుకలు చేయాలనుకుంటున్నా మేము అని అనగానే కామాక్షి సెటైర్లు వేస్తుంది.. అయితే నేనేం చేయమంటావు వచ్చి చప్పట్లు కొట్టాలా ఏంటి అంటూ కామాక్షి అంటుంది. అది కాదు వదిన మా అత్తయ్య ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుందట. అయితే ఆ గిఫ్ట్ నేనే తీసుకోవాలని అనుకుంటున్నాను. కానీ మా అత్తయ్య ఒక మెలిక పెట్టింది.. ఆమె మనసుకి తగిన గిఫ్ట్ ఇస్తే సర్ప్రైజ్ ఏటో వాళ్ళకి ఇస్తదంట మీ ఇంట్లో పాత సామాన్లు చాలానే ఉన్నాయి కదా.. అందులో ఓ పాత టీవీ ఉంది కదా దాని అట్ట కూడా అలానే ఉంది అని కామాక్షి అంటుంది. అయితే ఆ టీవీ నాకు ఇవ్వు ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏదో ఇస్తే దాంట్లో నీకు కూడా ఇస్తాను అని ప్రభావతి అంటుంది.
కామాక్షి మొదటి షాక్ అయిన కూడా ఆ తర్వాత ప్రభావతికి టీవీ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది.. మొత్తానికి ప్రభావతి తన అత్తగారిని బుట్టలో వేసుకొని ఎందుకు టీవీని ఇవ్వాలని అనుకుంటుంది. మీనా బామ్మ పుట్టినరోజు వేడుకలను వీడియో తీస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని సత్యం అడుగుతాడు. బామ్మ పుట్టినరోజు వేడుకలు ఈ వీడియో తీసి ఆయనకు పంపిస్తున్నాను మామయ్య అని అనగానే సుశీల సత్యం ఇద్దరూ షాక్ అవుతారు. ఏంటి వాడు పుట్టినరోజు వేడుకకు రావట్లేదా ఏంటి అని సత్యం అడుగుతాడు. అదేం లేదు మావయ్య వస్తాడు ఇప్పుడు ఏం చేస్తున్నారని వీడియో తీయమన్నాడు అని అంటుంది.
Also Read:సీరియల్ హీరో నిరంజన్ జీవితంలో ఊహించని ట్విస్టులు.. ఒంటరి జీవితం..
వాడు రాకుంటే ఎవరికీ ఏం నష్టం లేదులే అని ప్రభావతి అంటుంది. ఆ మాట విన్న సుశీల నోరుమూస్తావా అని అడుగుతుంది. వాడికి ఏదో అనుకుంటున్నాడు అత్తయ్య గారు అందుకే రావట్లేదు అని ప్రభావతి అంటుంది. ఇంట్లో కొందరు మనుషులు వాళ్ళ దుర్బుద్ధి తెలిసింది. అందుకే ఆయన ఇంట్లో ఉంటే ఎక్కడ గొడవలు అవుతాయి అని బయటికి వెళ్లిపోయారు అని నేను అంటుంది. సుశీల ఏం జరిగింది ఈ ప్రభావతి వాడిని ఏమైనా ఉందా అని అడుగుతుంది. ఈవిడ గారు అనని రోజు ఎప్పుడు ఉండదు లేండి అమ్మమ్మ వాళ్ళిద్దరికీ కొత్తేమి కాదు అని మీనా అంటుంది.. వాడికి అర్జెంటుగా ఫోన్ చేసి నేను రమ్మన్నాను అని పిలువు అని అంటుంది. బాలు మాత్రం రాజేష్ తో తిరుగుతూ మంచి గిఫ్ట్ కొనాలని ఉంటాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..