Serial Actress : సినిమా హీరోల కన్నా బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ హీరోలకి క్రేజ్ ఎక్కువ అన్న విషయం అబద్ధం కాదు. చాలామంది సీరియల్ హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. కేవలం ఒక్క సీరియల్ చేసిన ఆ హీరో లుక్, యాక్టింగ్ కు జనాలు ఫిదా అవుతున్నారు. ఈమధ్య బుల్లితెర హీరో నిరంజన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ భీభత్సంగా ఉంది.. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.. స్మార్ట్ గా ఉండటంతో అమ్మాయిలు అతని యాక్టింగ్ కు పడిపోతున్నారు..తెలుగులో రెండు సీరియల్స్ చేశారు. ఆ రెండు కూడా మంచి సక్సెస్ టాక్ ను అందుకున్నారు. ఈ హీరో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో తన లైఫ్ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఒంటరిగా ఉంటున్న విషయాన్ని బయట పెట్టారు.. అసలేం జరిగింది..? తన పేరెంట్స్ ఏమైయ్యారు..? అన్నది తెలుసుకుందాం..
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిరంజన్ మాట్లాడుతూ.. తెలుగులో నా మొదటి సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం. ఈ సీరియల్ ద్వారా లేడీ ఫాల్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇంత లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి యష్ కనెక్ట్ అయిపోయాడు. ఈ సీరియల్ స్టోరీ లైన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ సీరియల్ ని ఆదరించారు నాకు ఇంత సక్సెస్ రావడానికి జనాలే కారణమని ఆయన చాలా గొప్పగా చెప్పాడు. సీరియల్ గురించి మాత్రమే కాదు తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఈయన షేర్ చేసుకున్నారు. అమ్మ నాన్న అక్క నేను. ఇదే మా ఫ్యామిలీ. అమ్మ టీచర్ గా పని చేసేది. ఈమధ్య రిటైర్డ్ అయింది. నాన్న క్యాటరింగ్ పని చేస్తాడు. మమలిద్దరిని వాళ్ళు చాలా కష్టపడి చదివించారు. మా అమ్మ ఇంటిని గడపడానికి చాలా కష్టపడింది. నేను బేసిక్ గా దేవుని నమ్మను నాకు మా అమ్మే దేవుడు.. ఒక సందర్భంలో మా అమ్మకి జరిగిన యాక్సిడెంట్ నాకు ఇప్పటికీ కన్నీళ్లు తెప్పిస్తుంది. ఆ తర్వాత మళ్లీ మా అమ్మని చూస్తానని అనుకోలేదు. చాలా బాధపడ్డాను భయపడ్డాను కానీ అమ్మకి ఏం కాలేదని తెలుసుకొని నన్ను నేను ఓదార్చుకోడానికి చాలా టైం పట్టింది అని నిరంజన్ అన్నారు. డబ్బులు ఉంటేనే మనిషికి విలువ ఉంటుందని నాకు తెలిసింది కూడా అప్పుడే అని ఆయన తన జీవితంలోని కష్టాలను బయటపెట్టారు.
Also Read :సీక్రెట్ గా పెళ్లి.. ఏడాదికే విడాకులు..ఇప్పుడు ఏం చేస్తుంది..?
సీరియల్స్ లో నటించేందుకు ఫ్యామిలీకి దూరమవలసి వచ్చింది. ప్రస్తుతం నేను ఒంటరిగా ఉంటున్నాను. నా అనే వాళ్ళు పక్కన లేకున్నా ఉంటే ఆ వంట జీవితం నరకంగా ఉంటుంది అని నిరంజన్ అంటున్నారు..అలసిపోయి వచ్చిన తరువాత పలకరించడానికి నా అనేవాళ్లు ఉండరు. ఉన్నావా? తిన్నావా? అని అడిగేవారు ఉండరు. ఆ బాధలన్నీ పడాలి.. ఒకప్పుడు నాకు యాక్టింగ్ రాదని, నన్ను చూస్తే వాళ్లతో చేస్తుందని చాలా రకాల మాటలా అని నా మనసుని ఎంతో మంది బాధపెట్టారు. ఆ మాటలు విన్న నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. నన్ను అన్న వాళ్ళ నోర్లు మూయించాలి అని షార్ట్ ఫిలింలో మొదలుపెట్టి అలా నటనలో మెలకువలు నేర్చుకొని సీరియస్లలోకి ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు నేను చేసిన రెండు సీరియల్ మంచి సక్సెస్ అందుకోవడంతో అందరి నోర్లు మూతపడ్డాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను అని యష్ అన్నారు..ఈ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇకపోతే నిరంజన్ రెండు సీరియల్ చేశారు. ప్రస్తుతం ఓ సీరియల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దాని గురించి వెల్లడించే అవకాశం ఉంది.