OTT Movie : దర్శకురాలు మీరా నాయర్ రూపొందించిన సినిమా “మాన్‌సూన్ వెడ్డింగ్” పాతిక సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా, జాతీయ సరిహద్దులను దాటి, అమెరికా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ లయన్ అవార్డును కూడా గెలుచుకుంది. బాక్సాఫీస్ వద్ద అంతర్జాతీయంగా $30 మిలియన్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా, 21వ శతాబ్దపు 19వ అత్యుత్తమ రొమాంటిక్ మూవీగా నిలిచింది. ఢిల్లీలో జరిగే ఒక సంప్రదాయ పంజాబీ వివాహం నేపథ్యంలో సాగే ఈ కథ గ్లోబల్ హిట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘మాన్సూన్ వెడ్డింగ్’ (Monsoon Wedding) 2001లో వచ్చిన ఇండియన్ అమెరికన్ డ్రామా మూవీ. దర్శకురాలు మీరా నాయర్ (సలాం బాంబే, ది నేమ్‌సేక్ ఫేమ్) దీనిని రూపొందించారు. ఇందులో నసీరుద్దీన్ షా (లలిత్ వర్మ), లిల్లెట్ దుబే (పిమ్మీ వర్మ), వాసుంధర దాస్ (అదితి వర్మ) మెయిన్ రోల్స్ లో నటించారు. 114 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా, ఐయండిబిలో 7.3/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది.
ఢిల్లీలోని ఒక రిచ్ పంజాబీ ఫ్యామిలీలో లలిత్ వర్మ అనే ఫాదర్ కూతురు అదితి వర్మకి అరేంజ్డ్ మ్యారేజ్ ఫిక్స్ చేస్తాడు. గ్రూమ్ హేమంత్ రాయ్ అమెరికాలో NJలో సెటిల్ అయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వెడ్డింగ్ కోసం 4-5 రోజులు ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అవుతారు. వెడ్డింగ్ ప్లానర్ పి.కె. దుబే మారిగోల్డ్ ఫ్లవర్స్‌తో డెకరేషన్స్ చేస్తాడు. అప్పుడు మాన్సూన్ సీజన్ కావడంతో రెయిన్ పడుతూనే ఉంటుంది. మెహందీ, డాన్స్, పంజాబీ సంగీత్ ఫుల్ జోష్‌గా జరుగుతాయి. కానీ ఫ్యామిలీలో సీక్రెట్స్ బయటపడతాయి. అదితికి మ్యారేజ్ ఫిక్స్ అయినా ఆమె సీక్రెట్ లవర్ తో అఫైర్ ఉంది. దీంతో ఆమె గిల్ట్ ఫీల్ అవుతుంది. కజిన్ రియా వర్మ చైల్డ్ హుడ్‌లో అంకుల్ తేజ్ పూరీ నుంచి సెక్సువల్ అబ్యూజ్ ఎదుర్కొంది. ఇప్పుడు అతడు మళ్లీ ఒక చిన్న పాప మీద అలాంటి చెడు పని చేయడానికి ట్రై చేస్తాడు. ఈ విషయం గమనించిన రియా అతన్ని అడ్డుకుంటుంది. దీంతో కుటుంబంలో పెద్ద గొడవ జరుగుతుంది.
Read Also : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్
మరోవైపు లలిత్ వర్మ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో ఉంటాడు. వెడ్డింగ్ ఖర్చులు కూడా భారీగా ఉంటాయి. కానీ ఫ్యామిలీ గౌరవం కోసం తప్పని పరిస్థితి. ఇక పెళ్లి పనులతో సతమతమయ్యే వెడ్డింగ్ ప్లానర్ దుబే, ఇంటి పని మనిషి ఆలిస్‌తో ప్రేమలో పడతాడు. దుబే & ఆలిస్ మధ్య స్వీట్ లవ్ స్టోరీ సాగుతుంది. దుబే మొదట ఆలిస్‌ని ఇగ్నోర్ చేస్తాడు కానీ ఆమె చేసిన ఫుడ్ తిని ప్రేమలో పడతాడు. ఇక ఈ పెళ్లి క్లైమాక్స్ లో టెన్షన్ లోపెడుతుంది. చివరికి అదితి ఈ పెళ్లి చేసుకుంటుందా ? తన లవర్ కావాలనుకుంటుందా ? తేజ్ పూరీని ఫ్యామిలీ దూరం పెడుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.