Anasuya: హాట్ యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ అని కామెడీ షో ద్వారా అనసూయ తెలుగు ప్రజలకు పరిచయమైంది. చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని తన అందంతో, డాన్స్ తో ప్రేక్షకులను మెప్పించింది. ఇక జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ బుల్లితెర పైనే కాకుండా సినిమాల్లో కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడుతుంది.
ఒకపక్క షోస్ లలో యాంకర్ గా ఇంకోపక్క సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ బిజీగా మారింది. ఇక ఈ మధ్య షోస్ ను కూడా వదిలేసి పూర్తిగా సినిమాల మీదనే ఫోకస్ చేసింది. ఈ మధ్య రిలీజ్ అయిన పుష్ప 2 లో ద్రాక్షాయణిగా నటించి మెప్పించింది. సినిమాలు పక్కన పెడితే వివాదాలు కొనితెచ్చుకోవడంలో హాట్ బ్యూటీ ముందు ఉంటుంది. ఆంటీ అన్నారని ఒక వివాదం.. విజయ్ దేవరకొండ పేరు ముందు ది పెట్టుకున్నాడని ఇంకో వివాదం.. ఇలా ఏదో ఒకటి మీదకు తెచ్చుకోకపోతే అనసూయ ఉండలేదు.
అయితే అనసూయ కేవలం తన అభిప్రాయం మాత్రమే అని చెప్పుకొస్తున్నా.. ఫ్యాన్స్ మాత్రం ఫేమస్ అవ్వడానికి ఆమె ఇలా చేస్తుందని చెప్పుకొస్తున్నారు. ఇక కేవలం ట్విట్టర్ లోనే కాకుండా ఇంటర్వ్యూలో కూడా అనసూయ ఖరాకండీగా మాట్లాడుతూ ఉంటుంది. ఎక్కడ ఉన్నాం.. ఎలా మాట్లాడాలి అనేది కూడా చూసుకోకుండా మనసులో ఏది అనిపిస్తే అది చెప్పేస్తూ ఉంటుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె తన ప్రెగ్నెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. అనసూయ- భరద్వాజ్ కు ఇద్దరు మగపిల్లలు. ప్రస్తుతం వారు చదువుకుంటున్నారు. ఇంటర్వ్యూలో ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఎంతో బావుటుంది అన్న టాపిక్ మీద యాంకర్.. మూడో బిడ్డ కోసం ప్లాన్ చేయడం లేదా.. ? ఆడపిల్ల పుడుతుందేమో అంటే.. టక్కున అనసూయ ” మా ఆయన కోపరేట్ చేయడం లేదు.. నీకేంటి.. నువ్వు పిల్లలను కనేసి వర్క్ వెళ్ళిపోతావ్. ఇంట్లో చూసుకోవాల్సింది నేను అని మా ఆయన అన్నాడు.
నిజం చెప్పాలంటే ఇంట్లో ఆడపిల్ల ఉండాలి. ఒకసారి నా ఆరేళ్ళ కొడుకు ఆడపిల్ల ఎందుకు.. చంపేస్తా అని అన్నాడు. ఇంట్లో మగపిల్లలు పద్దతిగా పెరగాలంటే ఆడపిల్ల ఉండాల్సిందే. అప్పుడే వారికి బ్యాలెన్స్ ఉంటుంది. అమ్మాయిలతో ఎలా ఉండాలి అనేది వారికి తెలుస్తుంది. మా ఇంట్లో ముగ్గురు మీసాలు, గెడ్డాలు వేసుకొని తిరుగుతారు. ఆడవారే యూనివర్స్ ను చక్కబెడతారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.