BigTV English
Advertisement

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : షాకింగ్ ట్విస్టులు, ఊహించని క్లైమాక్స్ తో ఒక స్పానిష్ మూవీ థ్రిల్లర్ ఫ్యాన్స్ ని చూపు తిప్పుకోకుండా చేస్తోంది. ఈ కథ జాబ్ లాస్ తో తన ఇంటిని అమ్ముకున్న వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. మామూలుగా మొదలయ్యే ఈ కథ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో హీట్ పెంచుతుంది. థ్రిల్లర్ ఫాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన మూవీ ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘The Occupant’ (స్పానిష్ టైటిల్: Hogar) 2020లో వచ్చిన స్పానిష్ థ్రిల్లర్ మూవీ. డేవిడ్ & అలెక్స్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో జావియర్ గుటియెరెజ్ (జావియర్), మారియో కాసాస్ (టోమాస్), బ్రాంకా సువారెజ్ (లారా) మెయిన్ రోల్స్ లో నటించారు.103 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 6.4/10 ని పొందింది. 2020 మార్చి 25 నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

జావియర్ అనే వ్యక్తి ఒకప్పుడు సూపర్ సక్సెస్‌ఫుల్ అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్. చాలా లగ్జరీ లైఫ్, భార్య మార్గా, కొడుకు డానీతో కలిసి బార్సిలోనాలో బిగ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటాడు. కానీ ఒక్కసారిగా జాబ్ పోతుంది, డబ్బు ప్రాబ్లమ్స్ వచ్చి ఆ లగ్జరీ ఇంటిని అమ్మేసి చీప్ ప్లేస్‌కి మూవ్ అవుతారు. జావియర్ మనసు పాత ఇంటి మీదే ఉంటుంది. ఇల్లు అమ్మేటప్పుడు కూడా చాలా బాధపడుతూ అమ్ముతాడు. కొత్త ఓనర్స్ ఫ్యామిలీ (టోమాస్, లారా, వాళ్ల చిన్న కూతురు) వచ్చి సెటిల్ అవుతారు. వాళ్లు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని చూసి జావియర్‌కి జెలసీ పుట్టుకొస్తుంది. మొదట క్యూరియాసిటీగా స్టాక్ చేస్తాడు. ఇంటి దగ్గర తిరుగుతాడు, వాళ్ల లైఫ్ గురించి తెలుసుకుంటాడు. నెమ్మదిగా అది ఆబ్సెషన్ అవుతుంది. “ఆ ఇల్లు నాది, నా లైఫ్ ను వాళ్లు దొంగిలించారు” అని ఫీల్ అవుతాడు.


Read Also : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

జావియర్ సీక్రెట్‌గా కీతో ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. వాళ్ల పర్సనల్ థింగ్స్ దొంగిలిస్తాడు. ఇంట్లో వింత సౌండ్స్ క్రియేట్ చేస్తాడు, ఫ్యామిలీ మధ్య గొడవలు పెట్టిస్తాడు. టోమాస్ జాబ్ పోగొట్టించడానికి ప్లాన్ చేస్తాడు, లారాతో ఫ్లర్ట్ చేసి రిలేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు. చిన్న పాప మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ పెడతాడు. జావియర్ భార్య మార్గా అతడి వింత ప్రవర్తన చూసి డౌట్ పడుతుంది. కానీ అతడు అందరినీ మానిప్యులేట్ చేస్తాడు. ఫైనల్‌లో జావియర్ ప్లాన్ పీక్‌కి వెళ్తుంది. వయోలెంట్ ట్విస్ట్‌తో షాక్ ఇస్తాడు. ఆ ట్విస్ట్ ఏమిటి ?జావియర్ వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయి ? ఆ ఇంటిని జావియర్ సొంతం చేసుకుంటాడా ? అనే విషయాలను తెలుసుకోవాలని అనుకుంటే, ఈ స్పానిష్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

×