Pavani Karanam: ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఎక్కడ చూసినా ‘పుష్ప 2’ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. అందులో పుష్పరాజ్ అన్న కూతురిగా నటించిన అమ్మాయి ఎవరా అని నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. (Image Source: Pavani Karanam/Instagram)
‘పుష్ప 2’లాంటి సినిమాను మలుపు తిప్పే పాత్రలో నటించిన ఆ అమ్మాయి పేరు పావని కరణం. తను ఒక తెలుగమ్మాయి అనే విషయం చాలా తక్కువమందికి తెలుసు. (Image Source: Pavani Karanam/Instagram)
మంచిర్యాలలో పుట్టి పెరిగిన పావని.. వెండితెరపై నటి అవ్వాలనే ఆశతో హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకోవడంతో తనకు అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. (Image Source: Pavani Karanam/Instagram)
ముందుగా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్న పావనికి ‘పరేషాన్’తో బిగ్ బ్రేక్ లభించింది. అందులో తను చేసిన శిరీష పాత్ర చాలామంది ప్రేక్షకులను అలరించింది. (Image Source: Pavani Karanam/Instagram)
‘పరేషాన్’లో సమోసా తింటావా శిరీష డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. ఆ డైలాగ్‌తో పాటు అందులో నటించిన పావని కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది. (Image Source: Pavani Karanam/Instagram)
‘పరేషాన్’ చూసిన ప్రేక్షకులు పావని యాక్టింగ్ బాగుంది అనుకున్నారు కానీ అప్పటికీ తనెవరో చాలామందికి తెలియదు. ఇప్పుడు ‘పుష్ప 2’తో తన యాక్టింగ్ కెరీర్ టర్న్ అయిపోయింది. (Image Source: Pavani Karanam/Instagram)
సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న పావని కరణంకు ‘పుష్ప’లో అజయ్ కూతురిగా నటించే అవకాశం లభించింది. పార్ట్ 1లో తన పాత్ర అంతగా లేకపోయినా.. పార్ట్ 2లో మాత్రం తనకు మంచి ప్రాముఖ్యత లభించింది. (Image Source: Pavani Karanam/Instagram)
‘పుష్ప’ కంటే ముందు ‘పరేషాన్’తో పాటు ‘పైలం పిలగా’ అనే మూవీలో కూడా హీరోయిన్‌గా నటించింది పావని కరణం. దాంతో పాటు ‘హిట్ 2’లో కూడా ఒక చిన్న పాత్రలో మెరిసింది. (Image Source: Pavani Karanam/Instagram)
సోషల్ మీడియాలో పావని కరణంకు బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌తో పంచుకుంటూ ఉంటుంది పావని. (Image Source: Pavani Karanam/Instagram)
సోషల్ మీడియాలో పావని కరణం ఫోటోలకు చాలా లైకులు కూడా వస్తున్నాయి.