BigTV English

PSLV-C59 Launch: పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం సక్సెస్.. చప్పట్లతో మార్మోగిన ఇస్రో

PSLV-C59 Launch: పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం సక్సెస్.. చప్పట్లతో మార్మోగిన ఇస్రో

PSLV-C59 Launch: పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. గురువారం 4.12 గంటలకు నింగిలోకి నిప్పులు కక్కుతూ ప్రోబా 3 దూసుకుపోగా, ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం గురువారం ప్రయోగం జరగాల్సి ఉండగా, చివరి నిమిషంలో ప్రయోగాన్ని నేటికి వాయిదా వేశారు.


ప్రోబా-3 ఉపగ్రహాన్ని నింగిలోకి నేరుగా పంపించేందుకు భారత శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ-సీ 59 రాకెట్ ప్రయోగంతో పంపేందుకు నేటి మధ్యాహ్నంకు సన్నాహాలు పూర్తి చేశారు. కాగా అనుకున్న విధంగా నేడు ప్రోబా 3 భూమికి అత్యంత ఎత్తులో దాదాపు 60 వేల కిలోమీటర్ల పరిధిలో నింగి కక్ష్యలోకి దూసుకుపోయింది

నిర్దేశిత కక్ష్యలో..
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ భారత్‌కు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రోబా..3 శాటిలైట్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపారు. ఐరోపా దేశానికి చెందిన 2 శాటిలైట్స్ ని ప్రోబా-3 ఉపగ్రహంలో అమర్చారు. వీటిని గగనమార్గంలో పంపారు. నిర్దేశిత కక్ష్యలోకి వీటిని ప్రవేశపెట్టి, పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ ప్రయోగం ద్వారా భూమి నుండి 30 వేల కిలోమీటర్ల ఎత్తునుండి 60 వేల కిలోమీటర్లు ఎత్తులోని గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉన్న కక్షలోకి ఈ రెండు ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు.


సూర్యునిపై పరిశోధనలు
పూర్తిగా సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు ఈ ప్రోబాను ప్రయోగించారు. గతంలోనే భారత్ చంద్రయాన్ ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని ఇస్రో పంపించింది. ఈ ఉపగ్రహంలో 310 కేజీల బరువైన కరోనా గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, 240 కేజీల ఓకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ లని నింగిలోకి పంపనున్నారు భారత శాస్త్రవేత్తలు.

Also Read: Mangal Vakri 2024: అంగారకుడి తిరోగమనం.. డిసెంబర్ 7 నుంచి వీరికి అన్నీ మంచి రోజులే !

కృత్రిమ సూర్యగ్రహణం
న్యూ స్పేస్ ఇండియా ఆధ్వర్యంలో వాణిజ్యపరంగా ఉపగ్రహాలని ఇస్రో పంపుతోంది. ఇకపై సూర్యుడిపై పరిశోధనలకి ప్రోబా – 3 ఉపగ్రహం ఉపయోగపడనుంది. ఎప్పటికప్పుడు సూర్యకిరణాలను అధ్యయం చేస్తుంది. అలాగే కృత్రిమంగా సూర్యగ్రహణాన్ని సృష్టించడం, సూర్యకిరణాలని పట్టించడం వంటి ప్రయోగాలకి కీలకంగా మారనుంది ఈ ఉపగ్రహం. ఇస్రో చైర్మైన్ సోమనాధ్, శాస్త్రవేత్తల బృందం దీనిని పర్యవేకక్షించింది.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×